ePaper
Wednesday, September 23, 2026
ePaper
Homeజగిత్యాలధర్మపురి, రాయపట్నం గోదావరి నది తీరం వద్ద, రాయికల్ గణేశ్ నిమజ్జన ప్రాంతాలను ప్రత్యక్షంగా...

ధర్మపురి, రాయపట్నం గోదావరి నది తీరం వద్ద, రాయికల్ గణేశ్ నిమజ్జన ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్,ఎస్పీ

📰 Generate e-Paper Clip

జగిత్యాల,అర్జున్ సమాచారం:
గణేశ్ నిమజ్జనo శాంతియుతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సజావుగా జరిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్  సత్య ప్రసాద్  అన్నారు. ఈ రోజు జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  తో కలిసి గణేష్ నిమజ్జన ప్రాంతాలైన ధర్మపురి, రాయపట్నం గోదావరి నది తీరం, రాయికల్ వద్ద ఏర్పాట్ల పరిశీలన ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్బంగా కలెక్టర్   మాట్లాడుతూ .. వినాయక మండపాల నిర్వాహకులు తమ విగ్రహాలను భక్తి శ్రద్ధల మధ్య వేడుకలు నిర్వహిస్తూ వైభవంగా తరలించాలని సూచించారు.  ప్రతి ఒక్క నిర్వాహకులు అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించాలని ఎటువంటి సంఘటనలు జరగకుండా శోభయాత్ర, నిమజ్జనం వేడుకలు చేసుకోవాలని కోరారు.అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పక్కా ప్రణాళికతో వేడుకలను విజయవంతం చేయాలని ఆదేశించారు. వినాయక నిమజ్జనానికి కావలసిన, స్టేజ్, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, వైద్య సేవలు, అగ్ని మాపక శాఖ, మత్స్యశాఖ, అధికారులు సేవలు అందించాలని, నిమజ్జన ప్రదేశాల్లో పారిశుధ్య పనులు చేయించాలని, భారీ క్రేన్లు, చిన్న క్రెన్ లు, గజ ఈతగాళ్ళు అవసరం మేరకు అందుబాటులో ఉంచుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పట్టణ వాసులతో పాటు భక్తులు, పిల్లలు తరలివచ్చే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. నిమజ్జనం వేడుకలు భక్తులందరూ భక్తిశ్రద్ధలతో శాంతియుత వాతావరణంలో చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్బంగా జిల్లా ఎస్పి  మాట్లాడుతూ…. వినాయక నిమజ్జన కార్యక్రమాలు శాంతియుతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సజావుగా పూర్తి కావడానికి పోలీస్ శాఖ తరఫున అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. నిమర్జనం అంతయు ప్రశాంత వాతావరణం లో పూర్తి అయ్యేలా అవసరమైన ప్రాంతాలలో సిసి కెమెరాలను, వీడియోగ్రఫీ ఏర్పాటు చేశామని, స్థానిక గజ ఈతగాళ్లు ను నిమర్జన ప్రాంతములో అందుబాటులో ఉంచమని, శోభాయాత్ర వెళ్ళేమార్గం లో  ఇతర శాఖ ల యొక్క సమన్వయము తో ఎటువంటి అవాంతరములు తలెత్తకుండా పటిష్టమైన  చర్యలను తీసుకుంటున్నామని తెలిపారు. నిమజ్జనం సందర్భంగా డీజే లు, సౌండ్ సిస్టంలు,బాణాసంచా కాల్చడం వంటివి చేయరాదని తెలిపారు. చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, చట్టానికి లోబడి నడుచుకోవాలని తెలిపారు. చట్టానికి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తించిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినాయక నిమజ్జనంను శాంతియుతంగా, సామరస్యంగా జరుపుకోవాలని అందుకు ప్రజలు పూర్తిగా పోలీసు వారికి సహకారం అందించాలని కోరారు.
=========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!