ePaper
Wednesday, September 23, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్ఏసీబీ వలలో అసెస్ మెంట్ అధికారి

ఏసీబీ వలలో అసెస్ మెంట్ అధికారి

📰 Generate e-Paper Clip

మంచిర్యాల,అర్జున్ సమాచారం:
భీమిని మండలం, పెద్దాపేట గ్రామ పరిపాలన అధికారి (జి.పి.ఓ.) దుర్గా ప్రసాద్, ఫిర్యాదిదారుడి నుండి డిమాండ్ చేసిన రూ. 1,30,000/- లంచంలో మొదటి విడత అయిన రూ. 80,000/-ను  తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. పెద్దాపేట శివార్లలోని వ్యవసాయ క్షేత్రాల సమీపంలో ఏసీబీ ఆదిలాబాద్ రేంజ్ యూనిట్కు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.
ఫిర్యాదిదారుని పేరు మీద భూమి బదిలీ, పట్టా పాస్బుక్లను జారీ చేయడం రూ. 1,30,000/-లంచం డిమాండ్ చేశాడుజ. అందులో భాగంగా, మొదటి విడతగా రూ. 80,000/- మరియు పని పూర్తయిన తర్వాత మిగిలిన రూ. 50,000/- చెల్లించాలని ఆదేశించాడు.  బాధితులు లంచం నగదు ఇవ్వడానికి వచ్చినప్పుడు మరో వ్యక్తి పోతు రాజేందర్తో కలిసి మోటార్సైకిల్పై పెద్దాపేట  చేరుకుని, ఫిర్యాదిదారుడిని రూ.80,000/- తీసుకున్నాడు. అక్కడే మాటు వేసిన ఏసీబీ బృందం దుర్గాప్రసాద్ ను పట్టుకుంది. ఇద్దరిని అరెస్టు చేసి ఏసీబీ కోర్టుకు తరలించారు.
========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!