ePaper
Saturday, August 22, 2026
ePaper
Homeజాతియంనాలుగు రాష్ట్రాల్లో ఐదు ఫాస్ట్‌ ట్రాక్ కోర్టులు- నీట్ పేపర్ లీకేజీలో కేంద్రం దిద్దుబాటు చర్యలు

నాలుగు రాష్ట్రాల్లో ఐదు ఫాస్ట్‌ ట్రాక్ కోర్టులు- నీట్ పేపర్ లీకేజీలో కేంద్రం దిద్దుబాటు చర్యలు

📰 Generate e-Paper Clip

న్యూఢిల్లీ, జూలై 23,అర్జున్ సమాచారం:
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో విద్యార్థులను శాంతిపజేసేందుకు కేంద్రం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఉదయం ప్రధాని మోదీ చెప్పినట్టుగానే నాలుగు రాష్ట్రాల్లో ఐదు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. బాంబే హైకోర్టు బెంచ్‌ పరిధిలో రెండు ఫాస్ట్‌ ట్రాక్ కోర్టులు పని చేయనున్నాయి. ప్రతి రోజూ విచారణ జరిపి త్వరితగతిన తీర్పు వచ్చేలా ఈ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. నీట్ పేపర్‌ లీకేజీపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై ప్రధానమంత్రి మోదీ స్పందించాల్సి వచ్చింది. సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. తమకు యువత సంక్షేమం, భవిష్యత్తే ముఖ్యమని వెల్లడించారు. వారి శ్రేయస్సు,భవిష్యత్ కంటే ఏదీ ముఖ్యం కాదని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.  ప్రధానమంత్రి మోదీ గురువారం (జూలై 23) సోషల్ మీడియా వేదిక అయిన ఎక్స్‌లో ఈ పోస్టు పెట్టారు. అందులో ఇలా రాసుకొచ్చారు “పరీక్ష పేపర్ లీక్‌లో భాగమైన వారికి త్వరోలనే కఠినమైన శిక్ష పడేలా పడుతుంది. దీని కోసం ఒక ఫాస్ట్-ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం” అని తెలిపారు. ఈ విషయంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు మోదీ పేర్కొన్నారు.పేపర్ లీక్‌కు బాధ్యులైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తీసుకుంటున్న చర్యల్లో ఇది కూడా భాగమని పేర్కొన్నారు. యువత భవిష్యత్తుకు హాని తలపెట్టే వారిని ఎవరినీ వదిలిపెట్టబోమని ప్రధాని మోదీ హెచ్చరించారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం సైలెంట్ అయినట్టే ఒక్కసారిగా తీవ్ర రూపం దాల్చింది. పార్లమెంట్‌ సమావేశాల టైంలో దీని తీవ్ర ప్రభుత్వానికి తెలిసింది. ఇది జరిగి నెలలు గడిచింది. అప్పటి నుంచి కాక్రోజ్ జనతా పార్టీ లాంటి వాళ్లు నిరసనలు చేస్తూన్న, వాంగ్‌చుక్‌ దీక్ష చేసినా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. అయితే అసలైన ఒత్తిడి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచే మొదలైంది. ఓవైపు సభలో ప్రతిపక్షాలు కార్యకలాపాలను అడ్డుకుంటున్నారు. జంతర్ మంతర్ వేదికగా నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి. రోజు రోజుకు అక్కడ విద్యార్థి సంఘాల రాక ఎక్కువైంది. మరోవైపు కాంగ్రెస్ నాయకులు ప్రధాని నివాసాన్ని ముట్టడించారు. జులై 20న కూడా పార్లమెంట్ ముట్టడి గందరగోళానికి దారి తీసింది. విద్యార్థులపై పోలీసులు దమనకాండకు దిగారు. విద్యార్థులకు గాయాలు అయ్యారు. అటు పోలీసులు కూడా గాయపడ్డారు. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళలను మిన్నంటాయి. అన్నివైపు నుంచి తీవ్రంగా ఒత్తిడి రావడం ఇప్పుడు ప్రధాని స్పందించాల్సి వచ్చింది. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీలో కూడా ఇదే అంశంపై మోదీ స్పందించారు. పేపర్ లీక్ అనేది చాలా ఘోరమైన పాపమని అన్నారు. ఇలాంటివి భవిష్యత్‌లో జరగకూడదని అన్నారు. దీనికి కేంద్రంతోపాటు రాష్ట్రాలు బాధ్యత తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఫాస్ట్-ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటనపై కాక్రోచ్‌ జనతా పార్టీ తీవ్రంగా స్పందించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. అంటే ప్రధాని మోదీ ప్రకటనతో నిరసనకారులు సంతృప్తి చెందలేదనేది అర్థమవుతోంది. కేంద్రమంత్రి రాజీనామా చేసే వరకు నిరసనకారులు జంతర్ మంతర్‌ను విడిచిపెట్టే పరిస్థితి కనిపించడం లేదు.
==================================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!