ePaper
Saturday, October 3, 2026
ePaper
Homeతెలంగాణవరంగల్పట్టభద్రులంతా ఓటరుగా నమోదు కావాలి బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి ...

పట్టభద్రులంతా ఓటరుగా నమోదు కావాలి బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి వరంగల్ సెంట్రల్ లైబ్రరీని సందర్శించి విద్యార్థులకు విజ్ఞప్తి

📰 Generate e-Paper Clip

హనుమకొండ, అక్టోబర్ 3,అర్జున్ సమాచారం:
రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా శనివారం వరంగల్ సెంట్రల్ లైబ్రరీని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి సందర్శించారు. వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులను కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా నమోదు కావాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సాధారణ ఎన్నికలతో పోలిస్తే చాలా భిన్నమైనదని, ఇందులో ఉన్నత విద్యావంతులు, మేధావులు, సమాజం పట్ల సంపూర్ణ అవగాహన ఉన్నవారే ఓటు వేస్తారని అన్నారు. కాబట్టి ఇచ్చే తీర్పుకు ఎంతో విలువుంటుందని, నిరంతరం తమ కోసం పోరాడుతున్న వారికే మద్దతుగా నిలవాలని, ఎన్నికలప్పుడు మాత్రమే వచ్చి హడావుడి చేసి మొహం చాటేసే వారికి ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ పేరుతో అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మూడేళ్లు కావస్తున్నా 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, రాజీవ్ యువ వికాసం వికసించకుండానే వాడిపోయిందని, ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ, ప్రైవేట్ రంగంలో తెలంగాణ యువతకు 75 శాతం ఉద్యోగాల హామీ, నిరుద్యోగ యువతకు రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు, ఫీజు రీయింబర్స్ మెంట్, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్ హామీలన్నీ తుంగలో తొక్కారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రతీ పట్టభద్రుడు, నిరుద్యోగ యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. గత రెండేళ్లుగా తమ పక్షాన నిలబడి కొట్లాడుతున్న తనకు, బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని, జీవో 46 రద్దు కోసం సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయం, జీవో 29 రద్దు కోసం పోరాడిన అంశాలను గుర్తు చేశారు.
======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!