ePaper
Wednesday, November 11, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అమరావతిప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం.. ది సుపరిపాలనకు దక్కిన గౌరవం: సీఎం చంద్రబాబు ...

ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం.. ది సుపరిపాలనకు దక్కిన గౌరవం: సీఎం చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి అఖండ విజయం ఇది తన ప్రభుత్వ సుపరిపాలనకు లభించిన ఆమోదమన్న సీఎం చంద్రబాబు 2024 సాధారణ ఎన్నికల కంటే ఇప్పుడు ఆదరణ మరింత పెరిగిందని వెల్ల‌డి అనేక జిల్లాల్లో వైసీపీకి ప్రజా మద్దతు పూర్తిగా కరువైందని వ్యాఖ్య‌

📰 Generate e-Paper Clip

అమరావతి, అర్జున్ సమాచారం:

ఏపీలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సాధించిన అఖండ విజయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇది తమ ప్రభుత్వ సుపరిపాలనకు, రెండున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ధికి ప్రజలు ఇచ్చిన గౌరవమని ఆయన అభివర్ణించారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. “మంచి పరిపాలన మంచి రాజకీయాలకు దారితీస్తుంది (గుడ్ గవర్నెన్సు లీడ్స్ టు గుడ్ పాలిటిక్స్)” అని తాను నిరంతరం విశ్వసిస్తానని, ఆ నమ్మకాన్ని ప్రజలు మరోసారి నిజం చేశారని అన్నారు.  2024 సాధారణ ఎన్నికలతో పోలిస్తే, స్థానిక ఎన్నికల్లో కూటమికి ప్రజల ఆదరణ మరింతగా పెరిగిందని చంద్రబాబు విశ్లేషించారు. అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు మరింతగా తిరస్కరించారని స్పష్టం చేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా, వర్గాలకు అతీతంగా ప్రజలంతా కూటమి వైపే నిలిచారని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయన్నారు.  ఈవీఎం అయినా, బ్యాలెట్ పేపర్ అయినా, పోస్టల్ బ్యాలెట్ అయినా.. ప్రజలు కూటమికే మద్దతు పలికారని తెలిపారు. ముఖ్యంగా అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, పలనాడు, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల్లో వైసీపీకి ప్రజా మద్దతు పూర్తిగా కరువైందని ఆయన పేర్కొన్నారు. తుపాన్ల వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికే ప్రాధాన్యత ఇచ్చిందని, తాము పడిన కష్టాన్ని ప్రజలు గుర్తించారని చంద్రబాబు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించారని అన్నారు.  ఈ చారిత్రక విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని ఆయన వినమ్రంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ గెలుపు తమపై మరింత బాధ్యతను పెంచిందని, రాష్ట్ర అభివృద్ధి కోసం మరింత అంకితభావంతో పనిచేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!