తుగ్గలి,అర్జున్ సమాచారం :
: ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించే విధంగా అధికారులు మరింత బాధ్యతతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు.
శుక్రవారం పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండల కేంద్రంలో ఒక నెల ఒక గ్రామం కార్యక్రమం 4వ పర్యటనలో భాగంగా ప్రజల నుండి ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న అర్జీలను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.రీ ఓపెన్, ఇంప్రాపర్ రెడ్రెసల్ కేసులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.ఫిర్యాదులు పరిష్కరించడంపై అధికారులు, సిబ్బందికి ట్రైనింగ్ కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో అర్జీలు పరిష్కారం కావడంలేదని,అర్జిల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.అర్జీలలో అధిక శాతం భుమికి సంబంధించినవే ఉన్నాయని,ఈ విషయంలో రెవెన్యూ అధికారులు చొరవ తీసుకొని పరిష్కారం దిశగా కృషి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.ఇప్పటివరకు తుగ్గలి మండలంలో నిర్వహించిన 4 పీజిఆర్ఎస్ కార్యక్రమాల్లో మొత్తం 300 అర్జీలు రావడం జరిగిందని, అందులో 105 పరిష్కరించగలిగామని కలెక్టర్ తెలిపారు.రీసర్వేలో ఎక్స్టెంట్ వేరియేషన్,22ఎ సంబంధించిన అర్జీలు ఎక్కువగా రావడం జరుగుతోందని, వాటిని త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.పరిష్కరించడానికి సమయం పట్టే వాటిని మాత్రం ప్రాధాన్యత క్రమంలో పెట్టుకుని,వాటిని కూడా ఒక నెల లేదా ఒకటిన్నర నెలలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, పత్తికొండ ఆర్డీఓ ఓబులేసు,ఉమ్మడి గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర,డిఆర్డిఏ పిడి రమణా రెడ్డి, డిపిఓ భాస్కర్,తహసిల్దార్ రవి, ఎంపీడీవో విశ్వమోహన్, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
=========================
ప్రజా సమస్యలను అధికారులు త్వరితగతిన పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
RELATED ARTICLES

