ePaper
Wednesday, August 26, 2026
ePaper
Homeసినిమా"హైవాన్" మూవీ ట్రైలర్ రిలీజ్

“హైవాన్” మూవీ ట్రైలర్ రిలీజ్

📰 Generate e-Paper Clip

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ రూపొందిస్తున్న సినిమా “హైవాన్”. సరికొత్త థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ప్రెస్టీజియస్ మూవీతో ఫస్ట్ టైమ్ నెగిటివ్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు అక్షయ్ కుమార్. “హైవాన్” సినిమా సెప్టెంబర్ 11న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఈ రోజు ఈ చిత్ర ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. “హైవాన్” మూవీ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ ట్రైలర్ లో అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ మధ్య పోరాటం హైలైట్ గా నిలుస్తోంది. నెక్ట్స్ ఏం జరుగుతుంది అని ఆసక్తిని రేపే సన్నివేశాలతో ట్రైలర్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఒక యూనిక్ థ్రిల్లర్ మూవీని థియేటర్స్ లో చూడబోతున్న అనుభూతిని ట్రైలర్ తో కలిగించారు డైరెక్టర్ ప్రియదర్శన్. అక్షయ్ కుమార్ ఇప్పటిదాకా ఆయన కెరీర్ లో కనిపించనంత డార్క్ అవతార్ లో ఈ చిత్రంలో కనిపించారు. సైఫ్ అలీఖాన్ దివ్యాంగుడిగా ఛాలెంజింగ్ రోల్ ప్లే చేస్తున్నారు. వీరి మధ్య జరిగే సంఘర్షణ ఉత్కంఠ రేపుతోంది. వీరి పోరాటంలో విజయం ఎవరిది ? అనేది సినిమాలో చూడాలి. బోమన్ ఇరానీ జడ్జిగా, సయామీ ఖేర్ పోలీస్ అధికారిగా కనిపించి ఆకట్టుకున్నారు. శ్రియా పిల్గాంకర్, షరీబ్ హష్మీ ఇతర కీలక పాత్రల్లో మెరిశారు.
ఇప్పటికే రిలీజ్ చేసిన “హైవాన్” ఫస్ట్ లక్ పోస్టర్, టీజర్ పాన్ ఇండియా స్థాయిలో హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. “హైవాన్” మూవీతో అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ 17 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తుండటం విశేషం. ఈ చిత్రాన్ని నిర్మాతలు వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయ్ ఫెన్ హై క్వాలిటీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు.
నటీనటులు – అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్, బోమన్ ఇరానీ, సయామీ ఖేర్, శ్రియా పిల్గాంకర్, షరీబ్ హష్మీ, తదితరులు
============================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!