హైదరాబాద్, అక్టోబరు 28.అర్జున్ సమాచారం:
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి హైదరాబాద్లో పలువురు ప్రముఖులను కలిసి తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి, సోమల
రఘురామ్ రెడ్డిల వివాహ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఆయన నివాసంలో వైఎస్ షర్మిలా రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. కుటుంబ
సమేతంగా వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ శుభలేఖను అందజేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్కని ఆమె నివాసంలో షర్మిలా రెడ్డి, బ్రదర్ అనిల్ దంపతులు
కలిశారు. కుమార్తె వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా సీతక్క తనకు బహుకరించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్
రెడ్డి అరుదైన ఫోటో ఎంతో ప్రత్యేకమైనదని, అది ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర జ్ఞాపిక అని షర్మిల తెలిపారు.ఇదివరకే తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ సహా పలువురు రాజకీయ నేతల్ని షర్మిల ఈ
వేడుకకు ఆహ్వానించారు. ఇటీవల విజయసాయిరెడ్డి నివాసానికి వెళ్లిన ఆమెను ఆప్యాయంగా ఆహ్వానించారు. బెంగళూరులోని తన యలహంక ప్యాలెస్ నివాసంలో నవంబర్ 25న జరగనున్న తన కుమార్తె అంజిలిరెడ్డి వివాహానికి హాజరు కావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు.

