ePaper
Thursday, October 29, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌కు తాత్కాలిక ఊరట ఏసీబీ, పాస్‌పోర్ట్ అధికారులకు కోర్టు నోటీసుల...

ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌కు తాత్కాలిక ఊరట ఏసీబీ, పాస్‌పోర్ట్ అధికారులకు కోర్టు నోటీసుల జారీ కేసు తదుపరి విచారణ నవంబర్ 6కు వాయిదా

📰 Generate e-Paper Clip

హైద‌రాబాద్,అర్జున్ సమాచారం:
ఫార్ములా ఈ రేస్ నిధుల మళ్లింపు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావుకు తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఆయన పాస్‌పోర్ట్‌కు సంబంధించి జారీ అయిన నోటీసుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఫార్ములా ఈ కేసులో విచారణ జరుపుతున్న అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), కేటీఆర్ పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకోవాలని కోరుతూ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయానికి (ఆర్‌పీవో) లేఖ రాసింది. ఏసీబీ అభ్యర్థన మేరకు పాస్‌పోర్ట్ అధికారులు కేటీఆర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను సవాలు చేస్తూ కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం, పాస్‌పోర్ట్ నోటీసుల ప్రక్రియలో యథాతథ స్థితిని పాటించాలని ఆదేశించింది. ప్రతివాదులుగా ఉన్న ఏసీబీ, పాస్‌పోర్ట్ అధికారులకు నోటీసులు జారీ చేస్తూ, వారి వాదనలను కౌంటర్ అఫిడవిట్ రూపంలో సమర్పించాలని సూచించింది. అనంతరం, కేసు తదుపరి విచారణను నవంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో కేటీఆర్ పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకునే ప్రక్రియకు ప్రస్తుతానికి అడ్డుకట్ట పడినట్లయింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!