హుజురాబాద్: అర్జున్ సమాచారం:
తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ కోదండరాం నాయకత్వంలో టీజేఎస్ రాష్ట్ర కమిటీ మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న పలు సమస్యలతో పాటు స్థానిక సమస్యలను చర్చించినట్లు తెలంగాణ జన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ముక్కెర రాజు తెలిపారు.
ఎల్నినో కారణంగా ఇబ్బంది పడుతున్న రైతులను ఆదుకోవాలని, విద్యార్థులకు రావాల్సిన ఫీజ్ రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, తెలంగాణ ఉద్యమకారుల కోసం తగిన సహాయక చర్యలను తీసుకోవాలని పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేయాలని, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని, వారు ముఖ్యమంత్రిని కోరగా దానికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు ముక్కెర రాజు తెలిపారు.

