ePaper
Saturday, November 14, 2026
ePaper
Homeతెలంగాణవికారాబాద్మూసీ ప్రక్షాళన వికారాబాద్ నుంచే ఎందుకు ప్రారంభించరు? STP కేంద్రాన్ని సందర్శించిన మాజీ...

మూసీ ప్రక్షాళన వికారాబాద్ నుంచే ఎందుకు ప్రారంభించరు? STP కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ అభివృద్ధికి నిధులు ఎక్కడ? సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్‌పై మెతుకు ఆనంద్ ప్రశ్నల వర్షం

📰 Generate e-Paper Clip

వికారాబాద్:అర్జున్ సమాచారం:
వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మురుగునీటి శుద్ధి కేంద్రం (STP)ను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సందర్శించారు. ఈ సందర్భంగా STP కేంద్రం పనితీరును పరిశీలించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించారు.
మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నది పుట్టిన ప్రాంతం నుంచే శుద్ధి కార్యక్రమాన్ని ఎందుకు ప్రారంభించడం లేదని మెతుకు ఆనంద్ ప్రశ్నించారు. ముందుగా మూసీ నది మూల ప్రాంతాన్ని శుభ్రం చేయకుండా, దిగువ ప్రాంతాల నుంచి ప్రక్షాళన చేపడతామనడం ఎంతవరకు సమంజసమని వ్యాఖ్యానించారు. మూసీ ప్రక్షాళనలో వికారాబాద్ ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇటీవల కొడంగల్‌లో మూడు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో వికారాబాద్ జిల్లా అభివృద్ధి కోసం ఎన్ని నిధులు అడిగారు? ఎన్ని నిధులు సాధించారో ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్యమంత్రి వద్ద జిల్లా అభివృద్ధికి నిధులు అడిగారా? అడిగినా ప్రభుత్వం స్పందించలేదా? అని ప్రశ్నించారు.
తమ ప్రాంతానికి చెందిన వ్యక్తి శాసనసభ స్పీకర్‌గా ఉండటంతో వికారాబాద్ ప్రజలు ఎంతో ఆశలు పెట్టుకున్నారని, కొడంగల్ తర్వాత వికారాబాద్ జిల్లాకే అధిక నిధులు వస్తాయని భావించారని పేర్కొన్నారు. అయితే జిల్లా అభివృద్ధి విషయంలో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదని విమర్శించారు.
వికారాబాద్ ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జిల్లా అభివృద్ధి విషయంలో అనుసరిస్తున్న వైఖరిపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.
వికారాబాద్ జిల్లా అభివృద్ధి, ప్రజల ఆత్మగౌరవం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, జిల్లా ప్రయోజనాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటామని డాక్టర్ మెతుకు ఆనంద్ స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!