ePaper
Saturday, August 22, 2026
ePaper
Homeసినిమామెగాస్టార్ 'కాకా' మూవీ అదరగొట్టిన స్టైలిష్‌ టైటిల్ గ్లింప్స్‌

మెగాస్టార్ ‘కాకా’ మూవీ అదరగొట్టిన స్టైలిష్‌ టైటిల్ గ్లింప్స్‌

📰 Generate e-Paper Clip

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో మోస్ట్ అవైటెడ్ మూవీ #Mega158 / #ChiruBobby2, వెంకట్ కే నారాయణ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా ప్రకటన నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన టైటిల్ గ్లింప్స్ స్టైల్, యాక్షన్, రా మాస్ అప్పీల్‌తో ఆ అంచనాలను మరింత పెంచింది.
కె. సత్యం, సూపర్‌వైజర్‌గా చిరంజీవి ఆక్వా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడంతో గ్లింప్స్ ప్రారంభమవుతుంది. చెన్నై టీమ్‌కు ఫోన్ చేసి లోడ్ సమయానికి వస్తుందని చెబుతూ అందరినీ పలకరిస్తారు. సునీల్ లీవ్ అడగగా, తమ టార్గెట్ ఫెస్టివల్ అని చెప్పి లీవ్‌ను తిరస్కరిస్తారు. గెటప్ శ్రీను స్కూటర్ కీస్ గురించి చెప్పగా సత్యం వాటిని విసరమని చెబుతారు.
ఆ కీస్ అనుకోకుండా నీటిలో పడిపోతాయి. అయితే ఓ కుక్క ఒక రిమోట్ తీసుకొస్తుంది. దానితో మాగ్నెట్ సాయంతో కీస్‌ను బయటకు తీస్తారు. ఆసక్తికరంగా.. కీస్‌తో పాటు గన్స్ కూడా బయటకు వస్తాయి. ఆ తర్వాత కళ్లద్దాలు పెట్టుకున్న చిరంజీవిని చూపిస్తూ ‘కాకా’ టైటిల్‌ను రివీల్ చేయడం ఆదరిపోయింది. ఫ్లాష్‌బ్యాక్‌లో యంగ్, స్టైలిష్ చిరంజీవి గన్ ఫైరింగ్ సీక్వెన్స్‌తో కనిపించడం గ్లింప్స్‌కు మాస్ టచ్ ఇచ్చింది.
‘కాకా’ టైటిల్ పవర్‌ఫుల్‌గా ఉంది. టైటిల్ గ్లింప్స్ కూడా స్ట్రైకింగ్ విజువల్స్, డిఫరెంట్ సెటప్‌తో వెంటనే ఆకట్టుకుంటుంది. చిరంజీవిని అభిమానులకు, మాస్ ఆడియన్స్‌కు బలంగా కనెక్ట్ అయ్యేలా ప్రజెంట్ చేయడంలో బాబీ కొల్లి మరోసారి తన మార్క్ చూపించారు. రెండు విభిన్నమైన లుక్స్‌ను చూపించిన విధానం, పవర్‌ఫుల్ విజువల్స్, మ్యూజిక్, యాక్షన్ గ్లింప్స్‌ను ఆసక్తికరంగా మార్చాయి.
చిరంజీవి తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మెస్మరైజ్ చేశారు. బాబీ మెగాస్టార్‌ను రెండు విభిన్నమైన లుక్స్‌లో ప్రజెంట్ చేశారు. మిడిల్ క్లాస్ అవతార్‌లో చిరంజీవి చాలా సహజమైన చార్మ్ తో కనిపించగా, యంగ్ వెర్షన్‌లో ఆయన యాటిట్యూడ్, ఎనర్జీ ఆకట్టుకుంటాయి. గన్ ఫైరింగ్ సీక్వెన్స్‌లో ఆయన బాడీ లాంగ్వేజ్, ఈజీగా చూపించే స్వాగ్ మంచి మాస్ మూమెంట్‌ను క్రియేట్ చేశాయి. ముఖ్యంగా చివరి షాట్ బలమైన ఇంపాక్ట్‌ను ఇస్తుంది.
సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్ తన డైనమిక్ విజువల్ లాంగ్వేజ్‌తో గ్లింప్స్‌ను మరింత ఆసక్తికరంగా మలిచారు. ప్రారంభ సన్నివేశాల్లో కెమెరా దాదాపు చిరంజీవి పాత్రతో పాటు ప్రయాణిస్తున్నట్టుగా ఇమ్మర్సివ్ ఫీల్‌ను కలిగిస్తుంది. ఆ తర్వాత గ్లింప్స్ ముందుకు వెళ్లే కొద్దీ హై ఎనర్జీ ఫ్రేమ్స్, మాస్ ఎలివేషన్స్‌తో విజువల్స్ ఆకట్టుకున్నాయి.
ఎస్. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్ ఇంటెన్సిటీని మరింత పెంచింది. ‘గ్యాంగ్ లీడర్’లోని ఐకానిక్ ‘గ్యాంగ్ గ్యాంగ్’ పాటను రీమిక్స్ చేసి ఉపయోగించడం నోస్టాల్జియాతో పాటు చిరంజీవి స్టైల్‌కు మరింత స్వాగ్‌ను జోడించింది.
టైటిల్ గ్లింప్స్‌ను చూస్తే ‘కాకా’ పై అంచనాలు ఇప్పటికే భారీగా పెరిగాయి. చిరంజీవిని ఇప్పటివరకు చూడని తరహా క్యారెక్టరైజేషన్‌లో బాబీ కొల్లి చూపిస్తున్నారని గ్లింప్స్ స్పష్టం చేస్తోంది.
ఈ చిత్రంలో అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా, ఎడిటర్‌గా ఆంటోనీ ఎల్ రూబెన్, రచయితలుగా కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి, హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి పనిచేస్తున్నారు. భాను–నందు డైలాగ్స్ అందిస్తున్నారు.
మొత్తంగా టైటిల్ గ్లింప్స్ సినిమా వరల్డ్, భారీ స్కేల్, హీరో పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేస్తూనే.. సినిమాలోని మాస్, యాక్షన్, ఎమోషన్‌ అద్భుతంగా ప్రజెంట్ చేసింది.
2027 జనవరి 13న సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
తారాగణం: మెగాస్టార్ చిరంజీవి, అనశ్వర రాజన్, నివేదా పేతురాజ్, సునీల్, గెటప్ శ్రీను
========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!