ePaper
Friday, October 16, 2026
ePaper
Homeరామగుండంమెడికల్ షాపులపై ఆకస్మిక తనిఖీలు ప్రిస్క్రిప్షన్ లేకుండా నియంత్రిత మందులు విక్రయిస్తే చట్టపరమైన...

మెడికల్ షాపులపై ఆకస్మిక తనిఖీలు ప్రిస్క్రిప్షన్ లేకుండా నియంత్రిత మందులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు

📰 Generate e-Paper Clip

గోదావరిఖని:
 అర్జున్ సమాచారం:

రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ బి.శ్రీనివాస్ రావు నేతృత్వంలో ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెడికల్ షాపులపై నార్కోటిక్,డ్రగ్స్ నిరోధక శాఖ మరియు సీఐఎస్‌ఎఫ్ విజిలెన్స్ బృందాలు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి.
ఈ తనిఖీల్లో ట్రామడాల్, టాపెంటడాల్, నైట్రాజెపామ్, ప్రెగాబాలిన్, జోల్పిడెమ్, అల్ప్రాజోలం,కోడిన్ కలిగిన దగ్గు సిరప్‌ల విక్రయాలకు సంబంధించిన రికార్డులు,వైద్యుల ప్రిస్క్రిప్షన్లు,సేల్స్ రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. సంబంధిత ఔషధ చట్టాలు, నిబంధనలకు విరుద్ధంగా మందుల విక్రయాలు జరుగుతున్నాయా అనే అంశాన్ని తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పిట్ట శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ, వైద్యుల చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్ తప్పనిసరిగా అవసరమైన నియంత్రిత మందులను నిబంధనల ప్రకారమే విక్రయించాలని మెడికల్ షాపుల యజమానులు, సిబ్బందికి సూచించారు. మందుల విక్రయాలకు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, అనధికారికంగా నియంత్రిత లేదా నిషేధిత మందులను విక్రయించడం, సరఫరా చేయడం వంటి చర్యలకు పాల్పడరాదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ తనిఖీల్లో పెద్దపల్లి జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పిట్ట శ్రవణ్ కుమార్, నార్కోటిక్/టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ దీకొండ రమేష్, సీఐఎస్‌ఎఫ్ విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ బి.ప్రసాద్ రెడ్డి (ఆర్‌ఐ),ఎస్‌ఐ ఆర్.ఎస్.యాదవ్, హెడ్ కానిస్టేబుల్ బి. మురళీకృష్ణ, నార్కోటిక్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!