ePaper
Sunday, November 1, 2026
ePaper
Homeయాదాద్రి భువనగిరి జిల్లాయాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు..

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు..

📰 Generate e-Paper Clip

యాదాద్రి, అక్టోబర్ 31,అర్జున్ సమాచారం:
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ఆయన సతీమణి జానకి శుక్లా దర్శించుకున్నారు. శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్టోబర్ 28 నుంచి దేవస్థానంలో తెలంగాణ వేద విద్వన్మహాసభలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి శనివారం గవర్నర్ దంపతులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా యాదగిరిగుట్టపై ఉన్న అతిథి గృహం వద్దకు చేరుకున్న గవర్నర్‌కు మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఘనస్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ దంపతులు  లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకోగా.. అర్చకులు వేదమంత్రాలతో వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి భవానీ శంకర్ స్వామివారి జ్ఞాపికతో పాటు ప్రసాదాలను గవర్నర్‌కు అందజేశారు. అనంతరం దేవస్థానం రూపొందించిన 2027 నూతన వార్షిక క్యాలెండర్‌ను శివ ప్రతాప్ శుక్లా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దాన కిషోర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, దేవస్థాన కార్యనిర్వహణాధికారి భవానీ శంకర్, జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు సభ్యుడు లక్ష్మీనారాయణ పాల్గొన
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ఆయన సతీమణి జానకి శుక్లా దర్శించుకున్నారు. శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్టోబర్ 28 నుంచి దేవస్థానంలో తెలంగాణ వేద విద్వన్మహాసభలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి శనివారం గవర్నర్ దంపతులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా యాదగిరిగుట్టపై ఉన్న అతిథి గృహం వద్దకు చేరుకున్న గవర్నర్‌కు మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఘనస్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ దంపతులు  లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకోగా.. అర్చకులు వేదమంత్రాలతో వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి భవానీ శంకర్ స్వామివారి జ్ఞాపికతో పాటు ప్రసాదాలను గవర్నర్‌కు అందజేశారు. అనంతరం దేవస్థానం రూపొందించిన 2027 నూతన వార్షిక క్యాలెండర్‌ను శివ ప్రతాప్ శుక్లా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దాన కిషోర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, దేవస్థాన కార్యనిర్వహణాధికారి భవానీ శంకర్, జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు సభ్యుడు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!