ePaper
Wednesday, November 11, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్రెండు చార్జిషీట్ల కోసం రూ.2 లక్షల లంచం..! ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన కీసర ఎస్‌ఐ.....

రెండు చార్జిషీట్ల కోసం రూ.2 లక్షల లంచం..! ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన కీసర ఎస్‌ఐ.. పోలీస్ శాఖలో కలకలం..

📰 Generate e-Paper Clip

మేడ్చల్,అర్జున్ సమాచారం:
రెండు కేసుల్లో చార్జిషీట్లు త్వరగా దాఖలు చేసేందుకు రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేసిన కీసర ఎస్‌ఐ శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
భూ మోసం, 498ఏ కేసుల్లో చార్జిషీట్లు ఆలస్యం కాకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని ఎస్‌ఐ ఒత్తిడి చేస్తున్నట్లు బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సోమవారం కీసరలోని శిల్పా లేఅవుట్ వద్ద లంచం తీసుకుంటుండగా శ్రీనివాస్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
విచారణ అనంతరం నిందితుడిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత మూడు నెలల్లో ఇన్‌స్పెక్టర్ ఆంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి కూడా లంచం కేసుల్లో పట్టుబడటంతో పోలీస్ శాఖలో ఈ ఘటనలు చర్చనీయాంశంగా మారాయి.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!