ePaper
Saturday, November 7, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్గుంటూరురేటూరు వద్ద రైతులను ఉద్దేశించి మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు తుఫాన్ సహయక చర్యలను రైతులకు వివరించిన...

రేటూరు వద్ద రైతులను ఉద్దేశించి మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు తుఫాన్ సహయక చర్యలను రైతులకు వివరించిన సీఎం చంద్రబాబు

📰 Generate e-Paper Clip

గుంటూరు,అర్జున్ సమాచారం:
అర్నబ్, మురసు తుఫాన్ల వల్ల రాష్ట్రానికి పెద్ద ఎత్తున నష్టం వచ్చింది. తుఫాన్ల వల్ల పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్ల వల్ల రైతులు నష్టపోయారు.ఎల్ నినో వల్ల రైతులు గడ్డు పరిస్థితుల్లో ఉంటే… పట్టిసీమ ద్వారా నీళ్లందిస్తే రైతులు పంట వేసుకున్నారు. మంచి దిగుబడితో పంట చేతికందే సమయంలో మురసు తుఫాన్ రైతులను దెబ్బతీసింది. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతో చాలా వరకు నష్టాన్ని నివారించగలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
శుక్రవారం నాడు అయన రేటూరు దగ్గర రైతులను ఉద్దేశించి మాట్లాడారు. గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలను మురసు తుఫాన్ బాగా ఇబ్బంది పెట్టింది.ప్రతి రైతు పంటల బీమా చేయించుకోవాలని పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నాం.పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీతో నష్ట పోయిన పెట్టుబడిని రైతులు దక్కించుకోవచ్చు. తుఫాన్లపై ముందస్తు హెచ్చరికలు చేస్తే ఎవ్వరూ తేలిగ్గా తీసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ముందస్తు చర్యలతోనే చాలా వరకు ఆస్తి నష్టాన్ని తగ్గించి.. సహయక చర్యలు వేగంగా చేపట్టగలిగామని అన్నారు.
తుఫాన్ సహయ చర్యల కోసం తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు నుంచి సాయం తీసుకుంటున్నాం. అర్నబ్ తుఫాన్ వల్ల నేల కొరిగిన 30 వేల విద్యుత్ స్థంభాలను పునరుద్దరించగలిగాం. మురసు తుఫాన్ వల్ల కూడా మరో 10 వేల విద్యుత్ స్థంభాలు దెబ్బతిన్నాయి. ఆక్వా చెరువులకు విద్యుత్ సరఫరాను త్వరితగతిన పునరుద్దరిస్తున్నాం. అర్నబ్, మురసు తుఫాన్ల వల్ల సంభవించిన నష్టాన్ని పూర్తి స్థాయిలో అంచనా వేస్తున్నాం. తుఫాన్ల ప్రభావితంపై కేంద్రానికి ఎప్పటికప్పుడు సమాచారం అందించాం. తుఫాన్ల ప్రభావంపై ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చివరి వ్యక్తికి సాయం అందేంత వరకు పని చేస్తామని అన్నారు.
నల్లమడ డ్రైన్ కు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తాం. గత ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది. గత పాలనలో తుఫాన్లు వస్తే రెడ్ కార్పెట్ వేయించుకుని పర్యటనలు చేసి…పరామర్శించారు.  ఎన్నికల కంటే.. ప్రజా సమస్యలే ముఖ్యంగా భావించి తుఫాన్ల సమయంలో పనిచేశాం కొందరు ప్రభుత్వాన్ని ఇబ్బందిగా పెట్టడమే పనిగా పెట్టుకున్నారు. పరిషత్ ఎన్నికల ఫలితాలు వచ్చాక.. అన్ని విషయాలు మాట్లాడతాం.తీర ప్రాంతాలను తుఫాన్లు దెబ్బతీస్తే… రాయలసీమ ప్రాంతాన్ని ఎల్ నినో ఇబ్బంది పెట్టింది. రాయలసీమలో కూడా కరువును అధ్యయనం చేసేందుకు కేంద్ర బృందాలు పర్యటించాయి. తీర ప్రాంతంలో నీళ్లు వృధాగా సముద్రంలోకి పోతుంటే… రాయలసీమ ప్రాంతం నీటి కొరతను ఎదుర్కొంటోంది.అందుకే నీటి భద్రతకు.. సమర్ధ నీటి నిర్వహాణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు.
===============

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!