హైదరాబాద్,అర్జున్ సమాచారం:
తెలంగాణ ఎల్‌నినో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పేదల ఆహార భద్రత కోసం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. కేంద్ర ఆదేశాలతో తెలంగాణ పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆగస్టు1 నుంచి లబ్ధిదారులకు ఈ మూడు నెలల బియ్యం పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది.

