ePaper
Monday, September 7, 2026
ePaper
Homeజయశంకర్ భూపాలపల్లిబీఆర్ఎస్ పార్టీలో చేరిన 150 మంది యువకులు.గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన మాజీ...

బీఆర్ఎస్ పార్టీలో చేరిన 150 మంది యువకులు.గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర.

📰 Generate e-Paper Clip

బీఆర్ఎస్ పార్టీలో చేరిన 150 మంది యువకులు.గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర.

భూపాలపల్లి అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 7.

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డుకు చెందిన సుమారు 150 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మనీష్  అధ్యక్షతన పెద్ద సంఖ్యలో యువత మాజీ ఎమ్మెల్యే గండ్ర సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరగా,వారికీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డిరు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా జీవన్, రుచిత్,వేణు,కిరణ్, ఆకాశ్, సంపత్, సోహెల్, కారుణ్య, సంతోష్, శ్రీ చరణ్, సాయి కమల్, సాయి తేజ, శేషాంత్, ఆదిత్య, సాయి కిరణ్, రాజక్, శివ, వంశీ, మనోజ్, కార్తికేయ, సన్నీ, వివేక్, రాఖీ, సందీప్, విక్కీ, అనిల్ యారా, సాయి శివ, అనిల్, శ్రీకాంత్, అజయ్, చరణ్, సాయి, హరీష్, రాకేష్, బన్నీ, రేవంత్, సిద్ధు, సంజయ్, నిఖిల్, అన్వేష్, భారత్, సూర్య, జయంత్, హర్ష వర్ధన్, జంగంపెల్లి సాయి, సాయి చరణ్ (బ్యారెక్స్) తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ..

యువత భవిష్యత్‌తో పాటు భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం బిఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకగా బిఆర్ఎస్ పార్టీ నిలుస్తోందని పేర్కొన్నారు.

యువత పెద్ద సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం ప్రజల్లో,ముఖ్యంగా యువతలో బిఆర్ఎస్‌పై ఉన్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుండాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,23వ వార్డు యువత తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!