ePaper
Sunday, September 6, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్పి‌డి‌ఎస్ బియ్యం పట్టివేత – ఇద్దరిపై కేసు నమోదు

పి‌డి‌ఎస్ బియ్యం పట్టివేత – ఇద్దరిపై కేసు నమోదు

📰 Generate e-Paper Clip

పి‌డి‌ఎస్ బియ్యం పట్టివేత – ఇద్దరిపై కేసు నమోదు

భీమారం(మంచిర్యాల), అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 06 :

పౌరసరఫరాల శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పి‌డి‌ఎస్) బియ్యం భారీగా పట్టుబడింది. ఆదివారం (సెప్టెంబరు 6, 2026) భీమారం గ్రామ శివార్లలోని జోడువాగు వద్ద తనిఖీలు చేపట్టగా ఈ అక్రమ రవాణా వెలుగుచూసింది.

TS-19-TA-4511, TS-10-UC-7848 రిజిస్ట్రేషన్ నంబర్లు గల రెండు బొలెరో పికప్ వాహనాల్లో తరలిస్తున్న సుమారు 70 క్వింటాళ్ల పి‌డి‌ఎస్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బియ్యం విలువ దాదాపు ₹1.40 లక్షలు కాగా, వాహనాల విలువ ₹4 లక్షలుగా అంచనా వేశారు. స్వాధీనం చేసుకున్న మొత్తం సొత్తు విలువ సుమారు ₹5.40 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై డిప్యూటీ తహసీల్దార్ చల్ల స్రవంతి ఫిర్యాదు చేయడంతో, భీమారం ఎస్సై ఏ . రాజేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో నిందితులు తాళ్లపెల్లి గోపాల్, పస్తం సమ్మయ్యలను అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు చేపట్టారు.

రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసినా, నిల్వ చేసినా లేదా రవాణా చేసినా వారిపై కఠిన చర్యలు తప్పవని భీమారం పోలీసులు హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!