ePaper
Friday, August 14, 2026
ePaper
Homeతెలంగాణసీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ లో కర్ణాటక ఓటర్లు సెడం నియోజకవర్గం నుంచి 11...

సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ లో కర్ణాటక ఓటర్లు సెడం నియోజకవర్గం నుంచి 11 వేల మంది కొడంగల్ లో ఓటర్లుగా ఉన్నారు కొడంగల్ లో 22 వేల డూప్లికేట్ ఓట్లు ఉంటే, 11 వేలు కర్ణాటక ఓటర్లు ఉన్నారు. సరిగ్గా అంతే మార్జిన్ తో ఆయన గెలిచారు. అంటే సీఎంకు ఈసీ ఫేవర్ చేసిందా? వన్ నేషన్, వన్ ఎలక్షన్, వన్ ఓటు అనే విధానం ఉండాలి తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

📰 Generate e-Paper Clip

హైదరాబాద్ ,అర్జున్ సమాచారం :
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) పై మాకు చాలా అనుమానాలున్నాయి. సాధారణంగా ఎస్ఐఆర్ కు రిఫరెన్స్ ను ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి తీసుకోవాలి.  కానీ 2025 జనవరి నుంచి వీళ్లు ఎస్ఐఆర్ కు రిఫరెన్స్ పాయింట్ తీసుకుంటున్నారు.  ఏటా నిర్వహించే ఎస్ఎస్ఆర్ రిఫరెన్స్ పాయింట్ అయిన జనవరి 1 వ తేదీనే తీసుకోవాలి.  కానీ అలా కాకుండా గతేడాది జనవరి 1 తేదీని ఎస్ఐఆర్ కు రిఫరెన్స్ పాయింట్ చేశారు.  ఐతే మా భోదన్ లో పరిస్థితి ఎలా ఉందని తెలుసుకుంటే అక్కడ 7 వేలకు పైగా ఓట్లను తీసేశారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత  అన్నారు.
వాళ్లు షిప్ట్ అయ్యారా, చనిపోయారా? డూప్లికేషన్ ఓట్ల అనేది ఈసీ చెప్పటం లేదు.  జనవరి 1, 2025 నుంచి ఇప్పటి వరకు ఏడాదిన్నరలో ఒక్క భోదన్ నియోజకవర్గంలో 7 వేల ఓట్లు డిలీట్ అయ్యాయి.  ఈ 7 వేల ఓట్లకు సంబంధించి స్పష్టమైన క్లారిటీ ఇవ్వాలని మేము ఈసీ ని కోరుతున్నాం.  సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్ కి మూడు రాష్ట్రాల్లో ఓటు ఉందని చెబుతున్నారు.  ఆ ఓట్లను తొలగించేందుకు ఏడు ఏళ్లు పడితే భోదన్ లో మాత్రం ఏడాదిన్నరలో 7 వేల ఓట్లు తొలగించారు.  ఒక నియోజకవర్గంలో 2 శాతం కన్నా ఎక్కువ ఓట్లను తొలగించాల్సి వస్తే తొలిగించే ప్రతి ఓటరుకు మూడుసార్లు నోటీసులు ఇవ్వాలని ఈసీ నిబంధన ఉంది.  కానీ ఆ విధంగా ఎవరికీ నోటీసు ఇవ్వలేదు. ఇస్తే ఈసీ దీని గురించి స్పష్టమైన సమాచారం ఇవ్వాలి.  మా భోదన్ లో 7 వేల ఓట్లు తొలగించటంతో మేము మిగతా నియోజకవర్గాల్లో అలాగే జరిగిందా అన్న అనుమానంతో కొడంగల్ లో చెక్ చేశాం.  అక్కడ కేవలం 808 ఓట్లు మాత్రమే డిలీట్ చేశారు. భోదన్ లో ఏడు వేలు ఎలా? కొడంగల్ లో 8 వందలు మాత్రమే ఎలా?  కొడంగల్ లో దాదాపు 22, 433 డూప్లికేట్ ఓట్లు కూడా ఉన్నాయి. అందులో దాదాపు వెయ్యి వరకు మేము ప్రింట్ తీశాం.  2018 లో కొడంగల్ ఉన్న ఓట్ల సంఖ్యతో పోల్చుకుంటే 2023 నాటికి దాదాపు 30 వేల ఓట్లు పెరిగాయి.  పైగా కొడంగల్ కు పక్కనే ఉన్న కర్ణాటకలోని సెడం అనే నియోజకవర్గం నుంచి 11 వేల మంది ఓటర్లు కొడంగల్ లో ఉన్నారు.  సెడంలోనూ కొడంగల్ లోనూ 11 వేల మంది ఓటర్లు ఎలా ఉంటారని ప్రశ్నించారు.
కొడంగల్ లో ఉన్న డూప్లికేషన్, అదే విధంగా సెడం కు సంబంధించిన 11 వేల ఓట్లు కలిపితే 33 వేల ఓట్లు అవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ లో దాదాపు 33 వేల ఓట్ల మెజార్టీతోనే గెలిచారు.  అంటే డూప్లికేట్, అక్రమంగా రిజస్టర్ చేసుకున్న ఓట్లతో గెలుపు, ఓటములు నిర్ణయించబడుతున్నాయి.  దీన్ని బట్టి చూస్తే ఎన్నికల సంఘం ముఖ్యమంత్రికి ఏమైనా ఫేవర్ చేసిందా అనే అనుమానం వస్తోంది.  రాష్ట్రంలోని రెండు నియోజకవర్గాల్లోనే ఇలా ఉంటే మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటీ?కర్ణాటక నుంచి తెలంగాణకు డబ్బులు మాత్రమే కాదు. ఓట్లు కూడా ట్రాన్స్ ఫర్ అయ్యాయా? కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  మన దేశంలో వేరే దేశంలో వాళ్లకు ఓట్లు ఉండవద్దని అంటున్నారు. దానికి మేము అంగీకరిస్తాం.  కానీ ఒక రాష్ట్రంలో ఓటు ఉన్న వాళ్లకు మరొక రాష్ట్రంలో ఉండవచ్చా? మీరు ఒక రాష్ట్రంలో వేరే దేశ పౌరుడి ఓటు తొలగిస్తే వాళ్లు మరొక రాష్ట్రానికి వచ్చి నమోదు చేసుకోరా? అసలు ఇంటర్ స్టేట్ లో ఓట్ల డూప్లికేషన్ ను ఏరివేసేందుకు ఈసీ దగ్గర మెకనిజమే లేదు.  అలాంటప్పుడు 14 వందల కోట్లు పెట్టి ఎస్ఐఆర్ చేయటం వల్ల ప్రయోజనం ఏంటీ? ఈ ఎస్ఐఆర్ ద్వారా దేశంలో డూప్లికేషన్ ఓట్లు ఉండకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహించే పరిస్థితి రావాలి.  వన్ నేషన్, వన్ ఎలక్షన్, వన్ ఓటు అనే పరిస్థితి ఉండాలి.  కచ్చితంగా ఇంటర్ స్టేట్ మైగ్రేషన్, డూప్లికేషన్ అంశంపై దృష్టి పెట్టాలి.  అదే విధంగా దేశంలో ఉండే సంచార జాతుల వాళ్లకు ఏ విధంగా ఓటు ఇస్తారో చెప్పాలి? క ఇంట్లో ఉండే వాళ్లందరికీ ఓకే బూత్ లో ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలి.  ఎస్ఐఆర్ ద్వారా ఇంటర్ స్టేట్ డూప్లికేషన్ ఓట్లను కూడా కట్ చేయాలి. లేదంటే ఎస్ఐఆర్ కు అర్థం ఉండదు.  ఎస్ఐఆర్ అనేది పర్మినెంట్ సొల్యుషన్ గా ఉండాలని మేము కోరుతున్నాం.  మాలాంటి కొత్త పార్టీకి ఇది చాలా ఇంపార్టెంట్. కచ్చితంగా ఫెయిర్ గా ఎన్నికల జాబితా సిద్ధం చేయాలని ఈసీని కోరుతున్నాం.  మేము లేవనెత్తిన ప్రశ్నలన్నింటికీ ఈసీ సమాధానం చెప్పాలని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు.
==================================== ==

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!