ePaper
Friday, August 14, 2026
ePaper
Homeతెలంగాణపెద్దపల్లిరామగుండంలో ఈ.ఎస్.ఐ ఆస్పత్రి నిర్మించేది ఎప్పుడు? 2018 సెప్టెంబర్ లో అనుమతి ఇచ్చిన...

రామగుండంలో ఈ.ఎస్.ఐ ఆస్పత్రి నిర్మించేది ఎప్పుడు? 2018 సెప్టెంబర్ లో అనుమతి ఇచ్చిన కేంద్రం అనువైన స్థలం చూపించని గత, నేటి ప్రభుత్వాలు 2025 జనవరిలో కొత్త నిబంధన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చిన కదలని జిల్లా యంత్రాంగం

📰 Generate e-Paper Clip

గోదావరిఖని,అర్జున్ సమాచారం :
పెద్దపెల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వంద పడకల ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్ఐ) ఆస్పత్రి నిర్మాణం ముందుకు సాగడంలో అలసత్వం ఎందుకు జరుగుతుందని రామగుండం స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో బుధవారం రోజున నిరసన తెలుపడం జరిగిందని పేర్కొన్నారు.
అనంతరం రామగుండం స్వచ్చంద సంఘాల  అధ్యక్షులు మద్దెల దినేష్ ఉపాధ్యక్షులు *గోలివాడ చంద్రకళ లు మాట్లాడుతూ 2018 లోనే హాస్పిటల్ నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతి లభించినప్పటికీ గత బిఆర్ఎస్ సర్కార్ అనునువైన స్థలం చూపించలేదని తదనంతరం 2022లో సమాధుల పక్కన చెత్త డంపింగ్ యార్డ్ స్థలాన్ని చూపించారని ఈ స్థలానికి రోడ్డు కనెక్టివిటీ లేకపోవడం వల్ల ఈఎస్ఐ అధికారుల బృందం రిజెక్ట్ చేయడం జరిగిందనీ వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం 2023లో వచ్చిన ఈఎస్ఐ కొత్త నిబంధన ప్రకారం అనువైన స్థలాన్ని ఎంపిక చేయగా 2025 జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందన్నారు.
ఇప్పటివరకు పెద్దపల్లి జిల్లా యంత్రాంగం దీని నిర్మాణం గురించి పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రామగుండం ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణం విషయంలో నిర్లక్ష్యం చేయడం వల్ల ఆసుపత్రి నిర్మాణం కాకపోవడంతో అసంఘటిత కార్మికులు వారి కుటుంబాలు తీవ్ర నిరాశలో ఉన్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఏదైనా ఒక సంస్థలో 10 మంది అంతకంటే ఎక్కువ మంది పని చేస్తే వారికి ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ ఈ.ఎస్.ఐ వర్తింపజేస్తారని వారు పేర్కొన్నారు. కార్మికుడు పొందే వేతనం లో 0.75 శాతం కార్మికుడి నుంచి 3.25 శాతం మేనేజ్మెంట్ నుంచి కలిపి మొత్తం నాలుగు శాతం ఈ.ఎస్.ఐ కి జమ చేస్తారని,
వేతనం లో ఈ.ఎస్.ఐ క్రింద డబ్బులు జమచేసి కార్మికుడికి వారి కుటుంబ సభ్యులకు ఈ.ఎస్.ఐ హాస్పిటల్ లో వైద్య సేవలు అందిస్తారు.  ఈఎస్ఐ  రామగుండం బ్రాంచి పరిధిలో ఐదు జిల్లాలు వస్తాయని పెద్దపల్లి, మంచిర్యాల్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలకు చెందిన సుమారు 60000 మందికి పైగా కార్మికులు వస్తారని వీరిలో ఈ.ఎస్.ఐ డబ్బులు చెల్లించే ఎన్టిపిసి, ఆర్.ఎఫ్.సి.ఎల్, సింగరేణి, సిమెంట్ ఫ్యాక్టరీ, ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు షాపింగ్ మాల్స్, మున్సిపల్ కార్మికులు, బీడీ కార్మికులు ,వీవింగ్ మిల్లు కార్మికులకు వైద్య సేవలు అందించాలన్నారు.
ఇందుకోసం రామగుండం ఎన్టీపీసీ, బసంత్ నగర్ మంచిర్యాలలో మాత్రమే ఈఎస్ఐ డిస్పెన్సరీలు కొంత నడుస్తున్నాయని, జగిత్యాల సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు చెందిన కార్మికులు ఎక్కడ కూడా ఈఎస్ఐ డిస్పెన్సరీలు ఏర్పాటు చేయకపోవడంతో వారు వైద్య సేవలకు నోచుకోవడం లేదన్నారు.
ఒకవేళ ఈ జిల్లాలకు చెందిన వారు వైద్యం పొందాలంటే బసంత్ నగర్ లేక ఎన్టిపిసి వరకు వ్యయప్రయాసాలు కోర్చి వెళ్లక తప్పడం లేదన్నారు. పెద్ద జబ్బులు వస్తే వరంగల్,నాచారం సనత్ నగర్ లోని హాస్పిటల్ మరియు ఈఎస్ఐ హాస్పిటల్ లకు రిఫరల్ మీద వెళ్తున్నారన్నారు.
గతంలోనే ఐదు ఎకరాల స్థలం ఉంటేనే ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మించవచ్చని నిబంధనలు మార్పు చేసి 2023లో కొత్త నిబంధనలు తీసుకొచ్చారని రామగుండం పట్టణంలో మూడు ఎకరాల 30 గుంటల స్థలం ఉంటె చాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2025 లో జనవరి 8న ఈ.ఎస్.ఐ ఆస్పత్రి నిర్మాణానికి అనుమతించిందని ఇప్పటికీ ఏడాది దాటిన జిల్లా అధికార యంత్రాంగం రామగుండం ఈ.ఎస్. ఐ హాస్పిటల్ నిర్మాణం విషయంలో ఎందుకు ముందుకు కదలడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రికి కోసం నిధులు విడుదల చేసినా జిల్లా అధికార యంత్రాంగం ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ అసంఘటిత కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతుందని వారు విమర్శించారు.
రామగుండంలో చుట్టు ప్రక్క ప్రాంతాల వేలాది మంది కార్మికులు ఉన్నప్పటికీ ప్రాథమిక హెల్త్ సెంటర్లు మినహా ఎలాంటి మెరుగైన వైద్య సదుపాయాలు లేక అనారోగ్య బాధపడే కార్మికులు హైదరాబాదు లాంటి దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చి ఇబ్బంది పడుతున్నారని, కావున రామగుండంలో త్వరితగతిన ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని లేనియెడల రాజకీయ పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక ఏకం చేసి పోరాడుతుందని ప్రజా ప్రతినిధులను ప్రభుత్వాన్ని అధికారులను వారు హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపిన కాంట్రాక్ట్ కార్మిక సంఘం నేత  ఏం. గౌస్, వై. లెనిన్ అలాగే స్వచ్ఛంద సంఘాల సభ్యుల కంకటి రవి, బిళ్ళ శ్రీదేవి సరిత లక్ష్మి, కొండూ రమాదేవి, కె. సుశీల, ఇమ్మడి శారద, మేకల శోభా, మండల శ్రీనివాస్, నజీర్, వికాస్ తో పాటు తదితరుల పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!