ePaper
Thursday, August 13, 2026
ePaper
Homeతెలంగాణఆదిలాబాద్ఎండలు తగ్గే వరకు ఓసీపీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేయాలి

ఎండలు తగ్గే వరకు ఓసీపీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేయాలి

📰 Generate e-Paper Clip

ఎండలు తగ్గే వరకు ఓసీపీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేయాలి

-ఐఎన్‌టీయూసీ కేంద్ర కార్యదర్శి గడ్డం తిరుపతి యాదవ్

కమాన్ పూర్ .అర్జున్ సమాచారం ప్రతినిధి.O1జూలై.

వేసవి తీవ్రత, అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న కార్మికుల ఆరోగ్య రక్షణార్థం ఎండలు తగ్గే వరకు మజ్జిగ ప్యాకెట్ల సరఫరాను కొనసాగించాలని సింగరేణి కోల్మైన్స్ లేబర్ యూనియన్ ఐఎన్‌టీయూసీ కేంద్ర కార్యదర్శి గడ్డం తిరుపతి యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌కు వినతి పత్రం సింగరేణి ఆర్జి3 ఓసి1 గని మేనేజరు రావుల పాపయ్యకు గని కార్మికులతో కలిసి సమర్పించారు. నిబంధనల ప్రకారం ఓసీపీలలో మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ సమయం ముగిసినప్పటికీ, ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు, ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కార్మికులు, వారి కుటుంబాల ఆరోగ్యం, సంక్షేమం కోసం యాజమాన్యం తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రానికి సింగరేణి కొంగుబంగారం లాంటిదని, కార్మికుల ఆరోగ్యాన్ని పరిరక్షించడం యాజమాన్య బాధ్యత అని గడ్డం తిరుపతి యాదవ్ పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో ఐఎన్టియుసి గని పిట్ కార్యదర్శి తోకల ప్రవీణ్ రెడ్డి, నాయకులు యం.ప్రభాకర్ రెడ్డి, ముప్పిడి శ్రీనివాస్, సాతిని నాగరాజు, పాసర్తి రాజన్న, మహమ్మద్ రఫీ, రమేష్ లతోపాటు గని ఉద్యోగులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!