ePaper
Friday, August 14, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్ఏజెన్సీ నియోజకవర్గాల్లో అదనంగా రెండు వేల ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి సీఎం రేవంత్ రెడ్డికి కోరిన...

ఏజెన్సీ నియోజకవర్గాల్లో అదనంగా రెండు వేల ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి సీఎం రేవంత్ రెడ్డికి కోరిన గిరిజన ఎమ్మెల్యేలు

📰 Generate e-Paper Clip

హైదరాబాద్ ,అర్జున్ సమాచారం :
ఏజెన్సీ ప్రాంతంలోని శాసనసభ నియోజకవర్గాల్లో అదనంగా 2 వేల ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని ఆదివాసీ, గిరిజన ప్రాంత శాసనసభ్యులు ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి ని కోరారు.  పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క  నేతృత్వంలో ఆదివాసీ, గిరిజన శాసనసభ్యుల బృందం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి  కలిసి ఆ మేరకు ఒక వినతిపత్రాన్ని అందజేశారు.
ఆదివాసీ ప్రాంతాల్లో పోడు భూములకు పట్టాలు ఇవ్వడంతో పాటు ఇందిర గిరి జల వికాసం పథకాన్ని అమలు చేయాలని కోరారు. ఐటీడీఏలను మరింత బలోపేతం చేయడంతో పాటు గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఇంటర్ వరకు అప్ గ్రేడ్ చేయాలని కోరారు.
ముఖ్యమంత్రి ని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ (అశ్వరావుపేట),  పాయం వెంకటేశ్వర్లు (పినపాక),  కోరం కనకయ్య  (ఇల్లందు), తెల్లం వెంకట్రావు (భద్రాచలం),  వెడ్మ బొజ్జు (ఖానాపూర్)  ఉన్నారు. సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, , అడ్లూరి లక్ష్మణ్ కుమార్,  మహమ్మద్ అజారుద్దీన్ కూడా ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!