నాగర్ కర్నూలు,అర్జున్ సమాచారం:
నాగర్ కర్నూల్ జిల్లా బిజినిపల్లి మండలం ఉయ్యాలవాడ మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం నాడుఆకస్మిక తనిఖీ చేసారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ,జిల్లా కలెక్టర్, ఎస్పీ , అధికారులు తదితరులు పాల్గోన్నారు.
విద్యార్థులు పాఠశాలలు పునఃప్రారంభం అయినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన పాఠ్యాంశాల పై మంత్రి ఆరా తీసారు. విద్యార్థుల సమస్యల పై అడిగి తెలుసుకుని ..విద్యార్థులు స్నానాలు చేయడానికి వేడి నీరు రావడానికి సోలార్ ప్లాంట్ మంజూరు చేసారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులకు అందుతున్న మెనూ అందుతున్న బోజన వివరాలు అడిగి తెలుసుకుని స్టోర్ రూమ్ లో వంట సరుకుల నాణ్యత పరిశీలించారు. వంట గది లో వండిన ఆహార పదార్థాలను పరిశీలించి కూరగాయలు పరిశీలించారు.. తాజా కూరగాయలు వంటల్లో ఉపయోగించాలని సూచించారు.
==================
ఉయ్యాలవాడ గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన మంత్రి పొన్నం
RELATED ARTICLES

