ePaper
Thursday, August 13, 2026
ePaper
Homeతెలంగాణసిద్ధిపేటమిట్టపల్లి బాలికల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

మిట్టపల్లి బాలికల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

📰 Generate e-Paper Clip

సిద్దిపేట,అర్జున్ సమాచారం:
రుచికరమైన ఆహారాన్ని విద్యార్థులకు వడ్డించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి గురుకుల యాజమాన్యాలను ఆదేశించారు.
సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామ శివారులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్నం, వెజిటేబుల్ బిర్యానీ, ఆలుగడ్డ తమాట, ప్రైడ్ గుడ్డు కూర, సాంబారు, పెరుగు లను పరిశీలించారు. వెజిటేబుల్ బిర్యాని నాణ్యత పరిశీలిస్తూ బిర్యానీ నాణ్యత  చాలా బాగుందని అభినందించారు. ఇలాగే రోజు వారిగా కామన్ డైట్ మెనూ పాటిస్తున్నారా, చేసిన ప్రతి వంటకం రుచిగా ఉంటుందా అనీ ఆరా తీశారు. విద్యార్థుల హాజరు ప్రకారం కూరగాయలు, వంట సరుకులు కొలత ప్రకారం తీసుకోవాలని, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజన ప్రక్రియను ప్రిన్సిపల్ లేదా ఒక ఉపాద్యాయులు పర్యవేక్షణ చెయ్యాలని ఆదేశించారు. వంటగది, డైనింగ్ హాల్ పరిసర ప్రాంతాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గురుకుల ప్రాంగణం మొత్తం పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎక్కడ కూడా నీటి నిలువలు ఉండకుండా, దోమలు ఈగలు రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత పాటించి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా అవగాహన కల్పించాలని ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులను ఆదేశించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!