ePaper
Saturday, August 15, 2026
ePaper
Homeతెలంగాణమహబూబ్​నగర్జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయ మైదానంలో నూతన ఐరన్ షెడ్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయ మైదానంలో నూతన ఐరన్ షెడ్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

📰 Generate e-Paper Clip

మహబూబ్నగర్,అర్జున్ సమాచారం:
జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయ మైదానంలో నూతనంగా నిర్మించిన ఐరన్ షెడ్ను జిల్లా కలెక్టర్  కుష్బూ గుప్తా, జిల్లా ఎస్పీ  జానకి, సమక్షంలో ప్రారంభించారు.
ఈ ఐరన్ షెడ్ నిర్మాణానికి గతంలో విధులు నిర్వహించిన జిల్లా కలెక్టర్ చొరవతో డీఎంఎఫ్టీ (DMFT) నిధుల నుండి మంజూరు చేయడం జరిగిందని, ఆ నిధులతో ఈ నిర్మాణం పూర్తయి నేడు ప్రజలకు, పోలీసు శాఖకు ఉపయోగపడే విధంగా అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా, మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధి మరియు సమర్థవంతమైన పరిపాలనలో అన్ని శాఖల అధికారులు పరస్పర సహకారంతో పనిచేస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని తెలిపారు. జిల్లా యంత్రాంగంలోని వివిధ శాఖల మధ్య సమన్వయం, సహకారం ఉండటం వల్ల పరిపాలన మరింత సమర్థవంతంగా సాగుతుందని పేర్కొన్నారు. పోలీసు శాఖ ప్రజా భద్రత కోసం నిరంతరం సేవలందిస్తోందని, వారికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ సహకరిస్తుందని తెలిపారు.
అనంతరం జిల్లా ఎస్పీజానకి, మాట్లాడుతూ, పోలీసు శాఖ అవసరాలను గుర్తించి డీఎంఎఫ్టీ నిధుల ద్వారా మంజూరు చేసి ఐరన్ షెడ్ నిర్మాణానికి సహకరించిన జిల్లా కలెక్టర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లు, యూనిట్ల నుండి సిబ్బంది తరచూ అధికారిక విధుల నిమిత్తం వస్తుంటారని, వారు వేచి ఉండే సమయంలో ఎండ, వర్షం వంటి ఇబ్బందులు లేకుండా ఈ ఐరన్ షెడ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే పోలీసు పరేడ్లు, సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, ఇతర అధికారిక కార్యక్రమాల నిర్వహణకు కూడా ఈ షెడ్ ఎంతో దోహదపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, వర్టికల్ డీఎస్పీ బాలాజీ, ఆర్ఐలు కృష్ణయ్య, నాగేష్, అశోక్ కుమార్ ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
=====================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!