జూరాలకు భారీగా పోటెత్తిన వరద
33 గేట్లు ఎత్తివేత
మహబూబ్ నగర్, ప్రతినిధి అర్జున్ సమాచారం ఆగస్టు 5.
కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుంది. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది, దీంతో ప్రాజెక్టు కు 02 లక్షల 44 వేల క్యూసెక్కుల వరద నీళ్లు చేరుతుండడంతో అధికారులు ప్రాజెక్టు 33 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు శ్రీశైలం ప్రాజెక్టుకు 02 లక్షల 49 వేల 387 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో: 02 లక్ష ల 44 వేల క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో: 02 లక్షల 49 వేల 387 క్యూసెక్కులు గా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516. మీటర్లు ప్రస్తుత నీటిమట్టం..317.370 మీటర్లు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు. ప్రస్తుత నీటి సామర్థ్యం 7.707 టీఎంసీలు. ఎగువ, దిగువ జలవిధ్యుత్ కేంద్రలలో 11 యూనిట్ల లో434 మెగా వాట్ల విధ్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది

