ePaper
Friday, August 14, 2026
ePaper
Homeతెలంగాణభద్రాద్రిఅర్హులైన ప్రతి పౌరుడు ఓటరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలి డిప్యూటీ ఎన్నికల కమిషనర్ పవన్...

అర్హులైన ప్రతి పౌరుడు ఓటరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలి డిప్యూటీ ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మ

📰 Generate e-Paper Clip

భద్రాద్రి కొ్త్తగూడెం,అర్జున్ సమాచారం:
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి అని భారత ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మ  సూచించారు.
న్యూఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తో కలిసి అన్ని జిల్లాల ఎన్ని ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి అని భారత ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మ  సూచించారు.. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ అంకిత్,  భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ పాల్గొన్నారు.
జూలై 24లోపు డిజిటలైజేషన్ పూర్తి చేయాలని, అర్హులైన ప్రతి పౌరుడు ఓటరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించిన ఓటర్లను ముసాయిదా జాబితాలో చేర్చాలని, విచారణ లేకుండా ఏ ఓటరు పేరును తొలగించరాదని స్పష్టం చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 1,200 మందికి మించకుండా ఓటర్ల క్రమబద్ధీకరణ చేపట్టాలని ఆదేశించారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి  మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 99.6%, డిజిటలైజేషన్ 21.94% పూర్తైందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఈఆర్వో రవీంద్రనాథ్, తహసీల్దార్లు పుల్లయ్య, నరేష్, ఎన్నికల సూపరింటెండెంట్ రంగ ప్రసాద్, సాయి కృష్ణ, అనూష, నవీన్ తదితరులు పాల్గోన్నారు. .
===========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!