ePaper
Friday, August 14, 2026
ePaper
Homeతెలంగాణకరీంనగర్శ్రీ సరస్వతీ శిశు మందిర్, కరీంనగర్‌లో ఆచార్య నిరంతర ప్రశిక్షణా వర్గం ప్రారంభం.

శ్రీ సరస్వతీ శిశు మందిర్, కరీంనగర్‌లో ఆచార్య నిరంతర ప్రశిక్షణా వర్గం ప్రారంభం.

📰 Generate e-Paper Clip

కరీంనగర్,అర్జున్ సమాచారం:
శ్రీ సరస్వతీ విద్యాపీఠం, తెలంగాణ ఆధ్వర్యంలో శ్రీ సరస్వతీ శిశు మందిర్, కరీంనగర్‌ విభాగ్ స్థాయి ప్రాథమిక మరియు శిశువాటిక ఆచార్యుల కోసం రెండు రోజుల నిరంతర ప్రశిక్షణా వర్గ ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ విభాగ్ అధ్యక్షులు ముక్కాల సీతారాములు, కార్యదర్శి మెచినేని దేవేందర్ రావు, శైక్షణిక్ ప్రముఖ్ కాటం రవీందర్, సమితి కార్యదర్శి ఎలగందుల సత్యనారాయణ, పాఠశాల కార్యదర్శి ఇంజనీర్ కోల అన్నారెడ్డి, గట్టు శ్రీనివాస్, విభాగ్ ఉపాధ్యక్షులు కోట లక్ష్మారెడ్డి, పాఠశాల సంయుక్త కార్యదర్శి కొత్తూరు ముకుందం, జగిత్యాల జిల్లా సహా కార్యదర్శి బాజోజు శ్రీనివాస్ పాల్గొని ఆచార్యులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, విలువలు, క్రమశిక్షణ, దేశభక్తి, వ్యక్తిత్వ వికాసం పెంపొందించడంలో ఆచార్యుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. మారుతున్న విద్యా విధానాలకు అనుగుణంగా బోధనా నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని, ప్రతి ఆచార్యుడు సమాజ నిర్మాణంలో ఆదర్శంగా నిలవాలని సూచించారు.
ఈ శిక్షణా వర్గలో బోధనా పద్ధతులు, తరగతి గది నిర్వహణ, విద్యార్థుల మనోవిజ్ఞానం, విలువల ఆధారిత విద్య, కార్యాచరణ ప్రణాళిక వంటి అంశాలపై సమగ్రంగా శిక్షణ అందించబడింది.

కార్యక్రమంలో విభాగ్ పాఠశాల ప్రధానాచార్యులు, 160 మంది ఆచార్యులు, విద్యాపీఠం బాధ్యులు పాల్గొన్నారు అని నిర్వాహక పాఠశాల ప్రధానోద్యాయులు మోర రణధీర్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!