హైదరాబాద్,అర్జున్ సమాచారం:
చారిత్రక ప్రాధాన్యం కలిగిన తెలంగాణ శాసనసభ భవనంలో జరుగుతున్న మరమ్మతు, పునరుద్ధరణ పనులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పరిశీలించారు. ప్రాంగణమంతా తిరిగి పనుల పురోగతిపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకుని, పలు సూచనలు చేశారు.
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, అద్దంకి దయాకర్ , బల్మూర్ వెంకట్ , ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ , జైవీర్ రెడ్డి , ఉన్నతాధికారులు హాజరయ్యారు.
=====================

