ePaper
Saturday, August 15, 2026
ePaper
Homeజాతియండిఫెన్స్ లో మోడీ....

డిఫెన్స్ లో మోడీ….

📰 Generate e-Paper Clip

న్యూఢిల్లీ, జూలై  31,అర్జున్ సమాచారం:
కేంద్రంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఇటీవల జెన్ జీ ఆందోళనను ఆసరా చేసుకుని రాహుల్ కేంద్రంపై విరుచుకు పడేందుకు ప్రయత్నిస్తున్నారు. మ్యాగ్జిమం ప్రెషర్ వ్యూహాన్ని రెడీ చేసుకున్నారు. జెన్-జీ విద్యార్థుల నిరసనల తీవ్రతకు, ప్రతిపక్షాల వరుస ఆందోళనలకు లొంగి కేంద్రం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించారు. ప్రధాని మోదీ హయాంలో కేంద్రం ఇంతటి తీవ్ర ఆత్మరక్షణ ధోరణిలోకి వెళ్లడం ఇదే తొలిసారి. ఈ పరిణామాన్ని తమకు లభించిన అతిపెద్ద విజయంగా భావిస్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ద్వయం.. ఇప్పుడు తమ దాడులను నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపైకి మళ్లించారుపార్లమెంట్ లోపల, బయట రాహుల్ గాంధీ తీవ్రమైన ఆరోపణలు గుప్పిస్తూ రాజకీయ వేడిని పెంచారు. విద్యార్థుల ఆందోళనలపై పోలీసుల చర్యలను ప్రస్తావి విద్యార్థుల శరీరంపైకి పెల్లెట్లు, బుల్లెట్లు వేయించింది అమిత్ షానే అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సభలో మాట్లాడేందుకు పూర్తి అవకాశం ఇవ్వలేదని ఆరోపిస్తూ బయటకు వచ్చి విలేకరుల సమావేశం పెట్టి, జెన్-జీ తరాన్ని రెచ్చగొట్టేలా నేరుగా హోంమంత్రినే టార్గెట్ చేయడం ప్రతిపక్షం మార్చుకున్న దూకుడు వైఖరికి నిదర్శనం. సభలో ప్రియాంక గాంధీ సైతం ఇదే తరహా దూకుడును ప్రదర్శిస్తుండటంతో.. పార్లమెంట్‌లో ప్రతిపక్షం ఎటాక్ మోడ్‌లోకి వెళ్లగా, అధికార పక్షం కౌంటర్ ఇచ్చుకోవడానికి కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.మరో వైపు ప్రధాన్‌ను మార్చేసినట్లుగా ప్రధానిని మార్చేస్తామని కాక్రోచ్‌ పార్టీ ప్రెసిడెంట్ దీప్కే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రధాని మోదీ ఇన్ ఫ్లూయన్సర్‌గా మారాలని మాట్లాడుతున్నారు. వారి వెనుక ఆమ్ ఆద్మీ వంటి పార్టీలు ఉన్నాయి. ఆ విషయం బహిరంగంగా చెప్పుకోవడం లేదు. బీజేపీకి తెలుసు. కానీ ఇలాంటి వారికి బలం ఇచ్చింది బీజేపీ డిఫెన్సివ్ ధోరణినే. అందుకే భరించక తప్పడం లేదు.దశాబ్దాలుగా ఎలక్షన్ మెషినరీని, పార్లమెంటరీ వ్యూహాలను శాసిస్తున్న బీజేపీ, మోదీ-షా ద్వయం ఈ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు స్వంత శైలిలో కౌంటర్ స్ట్రాటజీని అమలు చేస్తోంది. అమిత్ షాపై రాహుల్ గాంధీ చేసిన పెల్లెట్ ప్రయోగం ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని, పార్లమెంట్ వేదికగా క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, జితేంద్ర సింగ్‌లు సభలో తీవ్రంగా నిలదీశారు. రూల్ బుక్ ఆధారంగా స్పీకర్ చేత ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించేలా చేయడంలో సఫలమయ్యారు. డిఫెన్సివ్‌గా కనిపిస్తూనే, మరోవైపు ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ వంటి జాతీయ భద్రతా బిల్లులను పార్లమెంట్‌లో ఆమోదింపజేసుకుంటూ.. తాము నేషనల్ సెక్యూరిటీ విషయంలో రాజీపడేదే లేదని, ఓటు బ్యాంక్ రాజకీయాలకు లొంగబోమని తమ శ్రేణులకు సంకేతాలు ఇస్తున్నారు. రాహుల్ గాంధీ విద్యార్థులను, యువతను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ దేశంలో అశాంతిని రేపుతున్నారని, ఆర్ఎస్ఎస్ , విద్యావ్యవస్థపై బురద జల్లుతున్నారని బీజేపీ మీడియా విభాగాలు విస్తృత ప్రచారం మొదలుపెట్టాయి. కానీ ఇవన్నీ అంతగా ప్రజల్లోకి వెళ్లడం లేదు.అత్యధిక సీట్లతో తిరుగులేని బలంతో ఉన్నప్పటికీ.. జెన్ జీ యువత ఆలోచనలు, వీధి పోరాటాలు , రాహుల్ గాంధీ దూకుడు ఈ సరికొత్త సవాలును తిప్పికొట్టడం బీజేపీకి అంత తేలికైన విషయమేమీ కాదు. ప్రభుత్వం బడ్జెట్, బిల్లుల ఆమోదంపై దృష్టి పెట్టినప్పటికీ.. మీడియా, సోషల్ మీడియా నెరేటివ్ యుద్ధంలో రాహుల్ పెంచుతున్న వేడిని బీజేపీ ఎంతవరకు అదుపు చేయగలుగుతుందనేది రాబోయే రోజుల్లో తేలనుంది
=================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!