ePaper
Friday, August 14, 2026
ePaper
Homeజాతియంనా భార్య బస్ క్లీనర్ తో లేచిపోయింది తిరువనంతపురం, ఆగస్టు 12

నా భార్య బస్ క్లీనర్ తో లేచిపోయింది తిరువనంతపురం, ఆగస్టు 12

📰 Generate e-Paper Clip

తిరువనంతపురం, ఆగస్టు 12,అర్జున్ సమాచారం:
నేటి కాలంలో సోషల్ మీడియా అనేది ఒక సమాంతర ప్రపంచంగా మారిపోయింది. అక్కడ కనిపించే ప్రతి దృశ్యం, ప్రతి నవ్వు నిజమని నమ్మే ప్రేక్షకులు కోట్లాది మంది ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా కపుల్స్‌ చేసే వీడియోలు, వారి మధ్య ఉండే అనురాగం చూసి మురిసిపోయే అభిమానులకు కొదవలేదు. కేరళంకు చెందిన అఖిల్, మేఘా కూడా అటువంటి క్రేజీ జంటనే. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో లక్షలాది మంది ఫాలోవర్స్‌తో, వేలాది మంది అభిమానులో వీరు ఒక ఆదర్శ దంపతులుగా గుర్తింపు పొందారు. కానీ కెమెరా వెనుక ఉండే చీకటి కోణం ఇప్పుడు వెలుగులోకి వచ్చి ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తోంది. ఆదర్శ దంపతులుగా పేరు తెచ్చుకున్న అఖిల్-మేఘా బంధం ఇప్పుడు ముక్కలైంది. భర్త అఖిల్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. తన భార్య మేఘా తనను వదిలి, ఒక లోకల్ బస్ కీనర్‌తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయిందని అఖిల్ ఆ వీడియోలో ఆరోపణలు చేశారు. వెళ్లిపోవడమే కాకుండా, ఇంట్లో ఉన్న నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను కూడా ఆమె తనతో పాటు తీసుకెళ్లిందని అఖిల్ పేర్కొన్నారు. ఒకప్పుడు తమ మధ్య తమ మధ్య ఉన్న ప్రేమను చూసి అసూయపడిన వారే ఇప్పుడు ఈ పరిస్థితి చూసి షాక్ అవుతున్నారు. ఈ వ్యవహారం ఆగస్టు 11 నాటి రాత్రి సమయంలో అఖిల తన సోషల్ మీడియా ఖాతాలో చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. అప్పటి వరకు వారిద్దరూ కలిసి చేసిన హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్‌, ట్రావెల్ రీల్స్‌ చూస్తున్న ఫాలోవర్స్‌కు ఇది ఒక పెద్ద పిడుగులాంటి వార్తగా మారింది. అఖిల్ తన కుటుంబం ఎదుర్కొంటున్న  గడ్డు పరిస్థితిని వివరిస్తూ, తాను తీవ్రమైన మానసిక  వేదనలో ఉన్నానని వాపోయాడు. ఈ ఘటన కేవలం ఒక జంట విడిపోవడం మాత్రమే కాదు, ఇది సోషల్ మీడియాలో కనిపించే పర్ఫెక్ట్‌ లైఫ్ వెనుక ఉన్న డొల్లతనాన్ని ఎత్తి చూపుతోంది. ఒక కోటీశ్వరుడిని పెళ్లాడిన మేఘా, సాధారణ బస్సు క్లీనర్‌తో వెళ్లిపోవడం అనేది నెటిజన్ల మధ్య తీవ్ర చర్చకు దారి తీసింది. వ్యక్తిగత సంబంధాల మధ్య ఆర్థికపరమైన మోసాలు చోటుచేసుకోవడం దీని తీవ్రతను పెంచింది. లక్షల మంది చూస్తున్నప్పుడు కెమెరా ముందు నవ్వుతూ నటించడం, కెమెరా ఆఫ్ అవ్వగానే మరో ప్రపంచంలో బతకడం అనే ధోరణిపై ఈ ఘటన చర్చను రేకెత్తిస్తోంది. అఖిల వెల్లడించిన వివరాల ప్రకారం, మేఘా పక్కా ప్రణాళికతోనే ఈ పని చేసినట్టు తెలుస్తోంది. ఇంట్లోని విలువైన వస్తువులను సర్దుకుని ఎవరికీ అనుమానం రాకుండా బస్ క్లీనర్‌తో కలిసి ఆమె వెళ్లిపోయిందని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ వ్యవహారంపై మేగా వైపు నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక స్పందన రాలేదు. ఆమె వాదన ఏంటీ? అసలు ఆమె ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. ప్రస్తుతం అఖిల్ చేసిన ఆరోపణలు మాత్రమే వైరల్ అవుతున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేశారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మేఘా స్పందన, అధికారిక వివరాలు బయటకు వచ్చిన తర్వాతే ఈ ఉదంతంలో పూర్తి నిజానిజాలు వెలుగు చూసే అవకాశం ఉంది. అప్పటి వరకు పర్ఫెక్ట్‌ కపుల్‌గా పిలుచుకునే ఈ జంట కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!