కమాన్ పూర్,అర్జున్ సమాచారం:
. కల్వచర్ల గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరం పాటు పడదామని గ్రామ సర్పంచ్ రేండ్ల శారద కుమారస్వామి అన్నారు. శనివారం రామగిరి మండలం
కల్వచర్ల గ్రామంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక గ్రామసభ నిర్వహించారు.
రామగిరి మండలం కల్వచర్ల గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక గ్రామసభను ఘనంగా నిర్వహించారు. ఈ గ్రామసభకు సర్పంచ్ రేండ్ల శారదకుమారస్వామి అధ్యక్షత వహించారు. గ్రామ అభివృద్ధికి సంబంధించిన తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, విద్య, ఆరోగ్యం తదితర అంశాలపై ప్రజలతో చర్చించి వారి సూచనలు, అభిప్రాయాలను స్వీకరించారు.
గ్రామ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇచ్చి, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక రూపొందించే దిశగా తీర్మానాలు చేశారు. గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సర్పంచ్ రేండ్ల శారదకుమారస్వామి ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కస్ప మహేందర్,కార్యదర్శి ప్రదీప్, వార్డు సభ్యులు,అంగన్వాడీ టీచర్లు,ఆశ వర్కర్లు, లైన్ మెన్ ఆకుల శ్రీనివాస్,ప్రాథమిక ఆరోగ్య శాఖా డా దేవేందర్,అగ్రికల్చర్ ఏ ఈ అరవింద్ పాల్గొన్నారు.
=============================

