మాలి కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చేందుకు రాష్ట్రస్థాయి సమావేశం
కాగజ్‌నగర్, (కొమురం భీం ఆసిఫాబాద్), అర్జున్ సమాచారం, ఆగస్టు 1:
మాలి కులాన్ని ఎస్టీ (షెడ్యూల్డ్ ట్రైబ్) జాబితాలో చేర్చాలనే సుదీర్ఘ డిమాండ్‌ను సాకారం చేసుకునేందుకు మాలి సమాజం కరచాలనం చేస్తోంది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, తమ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మరియు ఢిల్లీ యాత్రకు సన్నాహాలు పూర్తి చేసేందుకు ఆదివారం (ఆగస్టు 2) కాగజ్‌నగర్‌లోని విశ్రాంతి భవనంలో కీలక రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.
మాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు లెండుగురి శ్యామ్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అదే వసంతరావు నేతృత్వంలో ఆదివారం ఉదయం 11:00 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది.
ఈ కీలక సమావేశానికి రాష్ట్ర, జిల్లా, డివిజన్, మండల స్థాయి నాయకులతో పాటు గ్రామ అధ్యక్షులు, గ్రామ పటేళ్లు, సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, మేధావులు, యువత మరియు మాలి కులస్తులందరూ పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.

