సింగరేణిలో కనీస వసతులు కల్పించడంలో యాజమాన్యం అలసత్వం ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులు,
…. . అర్జున్ సమాచారం కోల్బెల్ట్ ప్రతినిధి ఆగస్టు 13 .
సింగరేణిలోని అన్ని ఏరియాలలో ఉత్పత్తికి కృషి చేస్తున్న కార్మికులకు నాణ్యమైన పనిముట్లను ప్రధానంగా బొగ్గు వెలికితీతకు అవసరమైన బిట్స్ రాడ్స్ కార్మికులు వేసుకునే బూట్లు చేతి గ్లౌజులు లాంటివి ఏవి కూడా కార్మికులకు ఇవ్వడం లేదు పైగా పనులు జరగకపోతే కార్మికుల మీద జులుం ఎక్కువయ్యింది ఇవన్నీ భరిస్తున్న కార్మిక వర్గం ఎవరికి తమ బాధలను చెప్పుకోవాలో అర్థం కాని దీనావస్థలో కాలం గడుపుతున్నారు దీనికంతటికి యాజమాన్యం పేర్కొంటున్న అంశం సంస్థ ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటుందని కనుకనే పనిముట్ల సరఫరాలో కొంత ఇబ్బంది కలుగుతున్న మాట వాస్తవమేనని అక్కడక్కడ చెప్పుతూ విషయాన్ని మాత్రం దాటవేస్తున్నారు పని భారం మోయలేక కార్మికులు విధులు నిర్వహించటంలో తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఒక్కరోజు నాగా చేసిన చార్జి సీట్లు ఇస్తూ కార్మికులను మానసిక వేధింపులకు గురి చేసే చర్యలు తీవ్రమయ్యాయి చైతన్యవంతమైన కార్మిక వర్గం చస్తూ బతుకుతూ విధులు నిర్వహించాల్సిన పరిస్థితులు సింగరేణి వ్యాప్తంగా నెలకొన్నాయి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నాయకులు కూడా ఈ విషయాన్ని అంతగా పట్టించుకున్నట్లు ఎక్కడ కనబడడం లేదు కంటిచూపు చర్యలకు పరిమితమవుతూ అడుగుతున్నాం తెస్తారు ఇస్తారు గని అధికారులకు వినతి పత్రాలు ఇస్తున్నాం జనరల్ మేనేజర్లకు విషయాన్ని తెలియజేస్తున్నాం అంటూ దాటవేస్తున్నారు తప్ప ఈ విషయంలో కార్మికులు ఎంతటి బాధలను అనుభవిస్తున్నారు అనే విషయాన్ని తీవ్రంగా పరిగణించటం లేదు పైగా గనుల్లో గాలి సరఫరా కూడా లేదని కార్మికులు ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్న పరిష్కరించాల్సింది పోయి బెదిరింపు చర్యలకు పాల్పడుతున్న సంఘటనలు కూడా లేకపోలేదు ఏదేమైనా యాజమాన్యం కార్మికులకు అవసరమైన పనిముట్లను సమకూర్చి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి ఇటు ఉత్పత్తి సాధనకు అటు కార్మికుల బాధలకు పరిష్కారాన్ని చూపాలని కార్మికులు కోరుతున్నారు ఇది ఇక్కడ అక్కడ అని కాకుండా సింగరేణి వ్యాప్తంగా అంతట ఈ పరిస్థితులే తాండవిస్తున్నాయి ఇప్పటికైనా కార్మిక సంఘాల నాయకులు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పైన దృష్టి పెట్టి యాజమాన్యపు వేధింపులను అడ్డుకునే ప్రయత్నం చేయాలని కార్మికులంతా కోరుతున్నారు

