ePaper
Saturday, August 15, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్ఉద్యమ స్ఫూర్తిని జనంలో రగిలించిన గొప్ప మేధావి జయశంకర్ సార్ కవిత

ఉద్యమ స్ఫూర్తిని జనంలో రగిలించిన గొప్ప మేధావి జయశంకర్ సార్ కవిత

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా జీవితం మొత్తం అంకితభావంతో పని చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొనియాడారు.  జయశంకర్ సార్ జయంతి నేపధ్యంలో అయనకు నివాళులర్పించారు.
కవిత మాట్లాడుతూ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను నిరంతరం ప్రశ్నిస్తూ, తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని నొక్కి చెప్పేవారు. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో తమను తాము పాలించుకోవాలని పరితపించేవారు. ఆ క్రమంలోనే ఎల్లప్పుడూ ఉద్యమ స్ఫూర్తిని జనంలో రగిలించిన గొప్ప మేధావి ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులని అన్నారు.
సాధించిన తెలంగాణలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు దక్కాలని, సామాజిక తెలంగాణ కావాలన్న వారి ఆశయాన్ని స్ఫూర్తిగా తీసుకొని, సామాజిక తెలంగాణ సాధనకై తెలంగాణ రక్షణ సేన నిరంతరం పోరాడుతుందని అన్నారు.
========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!