మండల స్థాయిలోనే ప్రజావాణి.. ప్రజలకు వరప్రసాదంపాలకుర్తి మండల పరిషత్‌లో ప్రతి సోమవారం అర్జీల స్వీకరణకలెక్టరేట్‌కు వెళ్లే శ్రమ తప్పింది: సూర సమ్మయ్య.
అర్జున్ సమాచారం పెద్దపల్లి ప్రతినిధి ఆగ స్టు 8.
పాలకుర్తి: ప్రజల సమస్యలను స్థానిక స్థాయిలోనే పరిష్కరించేందుకు ప్రభుత్వం మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించడం అభినందనీయమని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సూర సమ్మయ్య అన్నారు.
శనివారం పాలకుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్‌కు వెళ్లాల్సి వచ్చేదని, దీంతో సమయం వృథా కావడంతో పాటు ఆర్థిక భారం కూడా పెరిగేదని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మండల స్థాయిలోనే ప్రజావాణి నిర్వహించడం వల్ల ప్రజలకు ఎంతో సౌలభ్యం కలుగుతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక జీవో ప్రకారం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పాలకుర్తి మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని, మండల పరిధిలోని వివిధ శాఖల అధికారులు కూడా అందుబాటులో ఉంటారని చెప్పారు.
రెవెన్యూ సమస్యలు, కొత్త రేషన్ కార్డులు, వృద్ధాప్య, వికలాంగుల పింఛన్లు తదితర స్థానిక సమస్యలపై ప్రజలు లిఖితపూర్వకంగా వినతిపత్రాలు సమర్పించవచ్చని సూర సమ్మయ్య తెలిపారు.
ప్రజావాణిలో స్వీకరించిన అర్జీలను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రామగుండం శాసనసభ్యులు శ్రీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఆయన కోరారు.
మండల ప్రజలందరూ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూర సమ్మయ్య పిలుపునిచ్చారు.

