హైదరాబాద్,అర్జున్ సమాచారం:
హైదరాబాద్ లోని తన నివాసంలో జాతీయ జెండాను ఎగరేసిన కేంద్ర మంత్రి
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగా’ అభియాన్ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా విజయవంతం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపు ఇచ్చారు. అందులో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగిరేలా బిజెపి శ్రేణులు కృషి చేయాలని కోరారు.
‘హర్ ఘర్ తిరంగా అభియాన్’ ప్రోగ్రాం పురస్కరించుకుని కేంద్ర మంత్రి బండి సంజయ్ హైదరాబాద్ లోని తన నివాసం వద్ద జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
ఈ సందర్భంగా మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
దేశవ్యాప్తంగా ‘హర్ ఘర్ తిరంగా’ అభియాన్ ప్రోగ్రామ్లు నేటి నుండి హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరంగా యాత్ర’లను విజయవంతంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కోరారు.
కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రతి భారతీయుడు, విద్యార్థులు పెద్ద ఎత్తున భాగస్వామ్యమై స్వచ్ఛందంగా తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశంపై తమకున్న భక్తిభావాన్ని చాటుకోవడానికి ఇది సువర్ణావకాశమని పేర్కొన్నారు.
==============================

