హైదరాబాద్,అర్జున్ సమాచారం: రాయదుర్గంలో ప్రతిపాదించిన పీఎం ఏక్తా (యూనిటీ) మాల్ ప్రాజెక్టు టెండర్లలో భారీ కుంభకోణం మరియు ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, ఆ టెండర్లను రద్దు చేయాలని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు….
ఈ రోజు రాయదుర్గం భూముల వద్ద ఆందోళన చేపట్టిన దాసోజు శ్రవణ్, శంబిపూర్ రాజు.. బీఆర్ఎస్ శ్రేణులు..
రాయదుర్గంలోని అత్యంత విలువైన 6.30 ఎకరాల ప్రభుత్వ భూమి లో మొత్తం సుమారు 27 లక్షల చదరపు అడుగులు నిర్మాణం జరుపుటకు నిర్ణయం.. అంచనా వ్యయం: భూమి విలువ కాకుండా దాదాపు రూ. 2,059.81 కోట్లు.
కేంద్ర సహాయం: కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం రూ. 202 కోట్ల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది…
బీఆర్ఎస్ ప్రధాన అభ్యంతరాలు & ఆరోపణలు
ఈ ప్రాజెక్టులో ప్రభుత్వానికి దక్కే బిల్ట్-అప్ ఏరియా కేవలం 9 లక్షల చదరపు అడుగులు కాగా, ప్రైవేట్ డెవలపర్‌కు ఏకంగా 18 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని (ప్రభుత్వ వాటా కంటే రెట్టింపు) కేటాయించడంపై బీఆర్ ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు…
పీపీపీ (PPP) మోడల్‌లో టెండర్ నిబంధనలను ప్రైవేట్ సంస్థలకు లాభం చేకూర్చేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మార్చేసిందని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో లీజు ప్రాతిపదికన ఇస్తుంటే, ఇక్కడ ఏకంగా అమ్ముకునే వెసులుబాటు ఇచ్చారని విమర్శించారు…
కేంద్ర నిధుల దారి మళ్లింపు: కేంద్రం ఇచ్చే రూ. 200 కోట్ల వడ్డీ లేని రుణాన్ని తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ (TGTPC) ద్వారా నేరుగా ప్రైవేట్ డెవలపర్‌కు బదిలీ చేసేందుకు నిబంధనలు రూపొందించారని, ఇది కేంద్ర పథక నియమాలకు విరుద్ధమని పేర్కొన్నారు.
నిధుల దుర్వినియోగం: ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ, సర్వేలు, మరియు అనుమతుల పేరుతో ఇప్పటికే చేసిన ఖర్చులను కేంద్ర నిధుల నుండి సర్దుబాటు చేసుకునే వెసులుబాటు కల్పించడాన్ని తప్పుబట్టారు..
ల్యాండ్ ఇష్యూ (భూ వివాదం & కూల్చివేతలు)
ఈ యూనిటీ మాల్ నిర్మాణ స్థలానికి సంబంధించి గతంలో (2024 ఆగస్టులో) పెద్ద వివాదం నడిచింది. మాల్ నిర్మాణానికి కేటాయించిన స్థలంలో ఉన్న కొన్ని నిర్మాణాలను అక్రమ కట్టడాలంటూ అధికారులు జీహెచ్‌ఎంసీ (GHMC) సాయంతో కూల్చివేశారు. అయితే, ఈ భూమి తమ సొంత పట్టా భూమి అని, ఇన్యామ్ రద్దు చట్టం కింద దీనిపై స్పష్టత లేదని ‘హైదరాబాద్ టానరీస్’ అనే సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఇళ్లను కూల్చివేశారని బాధితులు ఆందోళన చేశారు…
బీఆర్ఎస్ డిమాండ్లు:
కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో, ఈ టెండర్ ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని, కాగ్ (CAG) లేదా ఇతర స్వతంత్ర సంస్థలతో విచారణ జరిపించే వరకు కేంద్ర నిధుల విడుదలను నిలిపివేయాలని కోరారు
===========================

