ePaper
Tuesday, August 18, 2026
ePaper
Homeతెలంగాణమహబూబ్​నగర్ఆర్టీసీ డ్రైవర్, శ్రామిక్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎస్పీ

ఆర్టీసీ డ్రైవర్, శ్రామిక్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎస్పీ

📰 Generate e-Paper Clip

మహబూబ్ నగర్,అర్జున్ సమాచారం:
మహబూబ్నగర్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని జిల్లాలకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ మరియు శ్రామిక్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియలో మహబూబ్నగర్ జిల్లా నుంచి 21 మంది, నాగర్కర్నూల్ జిల్లా నుంచి 21 మంది, వనపర్తి జిల్లా నుంచి 14 మంది, గద్వాల జిల్లా నుంచి 14 మంది, నారాయణపేట జిల్లా నుంచి 14 మంది అభ్యర్థులు కలిపి మొత్తం 84 మంది అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు. వీరిలో 64 మంది డ్రైవర్ పోస్టులకు, 20 మంది శ్రామిక్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఉన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతున్నది జిల్లా ఎస్పీ డి.జానకి, ప్రక్రియను పరిశీలించారు. అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన, ధ్రువీకరణ ప్రక్రియ పరిశీలించి, ప్రక్రియను సక్రమంగా నిర్వహించేలా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో AR అదనపు ఎస్పీ సురేష్ కుమార్, AO రుక్మిణీ భాయ్, RIలు కృష్ణయ్య, నగేష్, అశోక్ కుమార్ మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
===========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!