ePaper
Monday, August 17, 2026
ePaper
Homeతెలంగాణభీమారం లో బిఆర్ఎస్ కార్యకర్తల దర్నా :

భీమారం లో బిఆర్ఎస్ కార్యకర్తల దర్నా :

📰 Generate e-Paper Clip

భీమారం లో బిఆర్ఎస్ కార్యకర్తల దర్నా :

భీమారం(మంచిర్యాల),అర్జున్ సమాచారం, ఆగస్టు 17:

కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమ పథకాలైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌లను నిలిపివేసిందని ఆరోపిస్తూ భీమారం జాతీయ రహదారి పై సోమవారం బిఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు.

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పిలుపు మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి లబ్ధిదారులకు అందాల్సిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేయకుండా నిలిపివేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. పేద కుటుంబాల ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందించే ఈ పథకాలు నిలిచిపోవడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏలాంటి అడ్డంకులు లేకుండా నిలిచిపోయిన చెక్కులను తక్షణమే లబ్ధిదారులకు అందజేసి, ఈ పథకాలను యథావిధిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం మండల తహశీల్దార్ కార్యలయం లో వినతి పత్రం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ దాసరి మణిదీప్, వైస్ ఎంపీపీ జనంపల్లి సమ్మయ్య, డైరెక్టర్ బుక్యా రాజ్‌కుమార్, నియోజకవర్గ యూత్ లీడర్ శ్రీకాంత్ గౌడ్, ఎంపీటీసీలు ఎ. రాము, జె. తిరుపతి, సర్పంచ్ డి. మధునాథ్, వార్డు మెంబర్లు నరహరి, ప్రణీత్ గౌడ్, నాయకులు డి. లాజర్, బబ్లూ, పవన్, లచ్చన్న, బక్కయ్య తదితర పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!