ePaper
Friday, August 21, 2026
ePaper
Homeతెలంగాణఅశోక్‌నగర్‌ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్ల పంపిణీఎన్‌టీపీసీ రామగుండం సీఎస్‌ఆర్‌ సౌజన్యంతో 500 సైకిళ్ల పంపిణీ

అశోక్‌నగర్‌ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్ల పంపిణీఎన్‌టీపీసీ రామగుండం సీఎస్‌ఆర్‌ సౌజన్యంతో 500 సైకిళ్ల పంపిణీ

📰 Generate e-Paper Clip

అశోక్‌నగర్‌ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్ల పంపిణీఎన్‌టీపీసీ రామగుండం సీఎస్‌ఆర్‌ సౌజన్యంతో 500 సైకిళ్ల పంపిణీ.

పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 20:

రామగుండం నియోజకవర్గం గోదావరిఖని అశోక్‌నగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఎన్‌టీపీసీ రామగుండం సీఎస్‌ఆర్‌ సౌజన్యంతో పాఠశాల విద్యార్థులకు 500 సైకిళ్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి రామగుండం నియోజకవర్గ శాసనసభ్యుడు ఎం.ఎస్‌. రాజ్‌ఠాకూర్‌ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు సైకిళ్లను సద్వినియోగం చేసుకుని క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవుతూ విద్యలో రాణించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి సహకరిస్తున్న ఎన్‌టీపీసీ రామగుండం సీఎస్‌ఆర్‌ యాజమాన్యాన్ని అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మేయర్‌ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్‌ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, సంబంధిత అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!