ePaper
Wednesday, August 26, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్చిన్న కోతతో కూడిన కీ-హోల్ ఆర్థ్రోస్కోపీ శస్త్రచికిత్సలతో త్వరగా కోలుకునే అవకాశం ...

చిన్న కోతతో కూడిన కీ-హోల్ ఆర్థ్రోస్కోపీ శస్త్రచికిత్సలతో త్వరగా కోలుకునే అవకాశం డాక్టర్ సుకేష్‌రావు

📰 Generate e-Paper Clip

కరీంనగర్‌,అర్జున్ సమాచారం:

కరీంనగర్‌లోని రోగులకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో అధునాతన జాయింట్ కేర్ విభాగంలో షోల్డర్, మోకాలి ఆర్థ్రోస్కోపీ చికిత్సలను విస్తరించినట్లు ఆర్థోపెడిక్ నిపుణులు డాక్టర్ సుకేష్‌రావు సంకినేని తెలిపారు. బుధవారం నగరం లోని యశోద హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన విలకారుల సమావేశంలో అయన మాట్లాడుతు ఈ చిన్న కోత శస్త్రచికిత్సల ద్వారా కీళ్ల సమస్యలను కచ్చితంగా గుర్తించి చికిత్స చేయవచ్చుని తెలిపారు.. పెన్సిల్ పరిమాణంలో ఉండే ‘ఆర్థ్రోస్కోప్’ పరికరంలోని హై-డెఫినిషన్ (హెచ్‌డీ) కెమెరా సహాయంతో షర్ట్ గుండీ కంటే చిన్న రంధ్రం ద్వారా లోపలి కణజాలాలను పరిశీలించి ఆపరేషన్ చేస్తారని పేర్కొన్నారు. దీనివల్ల నొప్పి చాలా తక్కువగా ఉండడంతో పాటు ఇన్‌ఫెక్షన్ ప్రమాదం తగ్గి రోగులు వేగంగా కోలుకుంటారని వివరించారు. మిల్లీమీటర్ పరిమాణంలో ఉండే రంధ్రాలతో కండరాలకు ఎలాంటి గాయం కాదు. ఆపరేషన్ జరిగిన రోజే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళవచ్చుని చెప్పారు. కణజాలాలకు తక్కువ నష్టం జరగడం వల్ల పెయిన్ కిల్లర్స్ అవసరం ఉండదు.లైవ్ స్క్రీనింగ్ ద్వారా సాధారణ స్కాన్‌లలో కాని సమస్యలను గుర్తించవచ్చుని తెలిపారు . రోటేటర్ కఫ్ టియర్స్, ల్యాబ్రల్ టియర్స్, ఇంపింజ్‌మెంట్, భుజం కీలు జారడం, ఫ్రోజెన్ షోల్డర్. మెనిస్కస్ టియర్, ఏసీఎల్, పీసీఎల్ పునర్నిర్మాణం, విరిగిపోయిన చిన్న ఎముక ముక్కలు, కార్టిలేజ్‌ను తొలగించడం, ప్రారంభ దశ ఆర్థరైటిస్ కోసం జాయింట్ డీబ్రైడ్‌మెంట్. యశోద హాస్పిటల్‌లో అత్యాధునిక సర్జికల్ టెక్నాలజీ, మైక్రో- ఇన్‌స్ట్రుమెంట్స్‌తో పాటు అనుభవజ్ఞులైన స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణులు, ఫిజియోథెరపిస్టుల బృందం అందుబాటులో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ సిబ్బంది శ్రీకాంత్, మహేందర్ పాల్గొన్నారు.
===============================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!