చెన్నూరులో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలుశార్వణి పాఠశాలలో చిన్నారుల వేషధారణ, ఉట్టి కొట్టే కార్యక్రమాలతో సందడి.
చెన్నూర్, సెప్టెంబర్ 4 (అర్జున్ సమాచారం):
పట్టణంలోని శార్వణి పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలో ముస్తాబై అందరినీ ఆకట్టుకున్నారు. చిన్నారులు సంప్రదాయ దుస్తులు ధరించి, కృష్ణుడి వేణువు, నెమలిపింఛం తదితర అలంకరణలతో సందడి చేశారు.
అలాగే ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థులు ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొని వేడుకలకు మరింత శోభను తీసుకువచ్చారు. దీంతో పాఠశాల ఆవరణ మొత్తం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ ప్రాముఖ్యతతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల విశిష్టతను విద్యార్థులకు వివరించారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా చిన్నారుల్లో మన సంప్రదాయాల పట్ల అవగాహన, ఐక్యతా భావం, ఉత్సాహం పెంపొందుతాయని తెలిపారు.
కార్యక్రమంలో పాఠశాల పాఠశాల కరస్పాండెంట్ మేడా శ్రావణ్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను విజయవంతం చేశారు

