పత్రికా ప్రకటన. తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక మరియు పెన్షనర్ల సమస్యలపరిష్కారానికి TGEJAC రాష్ట్ర కమిటీపిలుపు .
అర్జున్ సమాచారం .ప్రతినిధి ,మంచిర్యాల ఆగస్టు 4.
మేరకు చలో హైదరాబాద్ ను విజయవంతం చేయాలి. తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక మరియు పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర చైర్మన్ శ్రీ మారం జగదీశ్వర్ గారి సెక్రటరీ జనరల్ శ్రీ ఏలూరి శ్రీనివాస్ రావు గారి మరియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తేదీ 10.09.2026 గురువారం రోజున చలో హైదరాబాద్ కార్యక్రమం ను విజయవంతం చేయడానికి TGEJAC మంచిర్యాల జిల్లా చైర్మన్ శ్రీ గడియారం శ్రీహరి గారి మరియు సెక్రటరీ జనరల్ శ్రీమతి వనజా రెడ్డి గార్ల ఆధ్వర్యం లో టీఎన్జీవో భవన్ మంచిర్యాలలో ముందస్తు సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగినది. TGEJAC మంచిర్యాల జిల్లా చైర్మన్ శ్రీ గడియారం శ్రీహరి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు సెప్టెంబర్ 10వ తేదీన తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమం ను విజయవంతం చేయడానికి మంచిర్యాల జిల్లా నుంచి 5 వేల ఉద్యోగులు తక్కువ కాకుండా జిల్లా చలో హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొని ఉద్యోగ ఉపాధ్యాయుల కార్మికుల పెన్షన్ సమస్యలను పరిష్కారం కొరకు మంచిర్యాల నుంచి పెద్ద ఎత్తున హాజరుకావాలని తెలపడం జరిగినది తదుపరి చలో హైదరాబాద్ వాల్ పోస్టర్ ను విడుదల చేయడం జరిగినది. ఈ సనాహకు సమావేశంలో
కో-చైర్మన్లు పొన్న మల్లయ్య, శ్రీపతి బాపురావు డిప్యూటీ సెక్రటరీ జనరల్ బొడ్డు శ్రావణ్ కుమార్, అత్తే సుధాకర్ వైస్ చైర్మన్ సూరినేని గంగాధర్, నాగుల గోపాల్ సెక్రటరీలు నడిమెట్ల సత్యనారాయణ, తంగళ్ళపల్లి తిరుపతి, ఎస్.ప్రభు మరియు టీజీవో,టీఎన్జీఓ, నాయకులు, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల మరియు కార్మిక సంఘాల ప్రతినిధులు నాయకులు మరియు జిల్లా లోని అన్ని శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

