ePaper
Tuesday, September 8, 2026
ePaper
Homeజగిత్యాలమూడవ జాతీయ లోక్ ఆదలాత్ నిర్వహించడం కోసమ్ మీడియా సమావేశం

మూడవ జాతీయ లోక్ ఆదలాత్ నిర్వహించడం కోసమ్ మీడియా సమావేశం

📰 Generate e-Paper Clip

మూడవ జాతీయ లోక్ ఆదలాత్ నిర్వహించడం కోసమ్ మీడియా సమావేశం

జగిత్యాల జిల్లా ప్రతినిధి ::అర్జున్ సమాచారం సెప్టెంబర్ 8::

గౌరవనీయులైన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి శ్రీమతి సి. రత్న పద్మావతి గారు మరియు I అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి శ్రీమతి సునీత రవీంద్ర రెడ్డి గారి ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి సరిత మట్ట గారు మూడవ జాతీయ లోక్ అదాలత్ నిర్వహణకు సంబంధించి మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 12, 2026న జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో నిర్వహించనున్న మూడవ జాతీయ లోక్ అదాలత్ ఏర్పాట్లు, పరిష్కరించనున్న కేసుల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా DLSA కార్యదర్శి మాట్లాడుతూ, న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను పరస్పర అంగీకారం, రాజి మరియు సామరస్యపూర్వక పరిష్కారం ద్వారా త్వరితగతిన పరిష్కరించేందుకు లోక్ అదాలత్ ఒక సమర్థవంతమైన వేదికగా ఉపయోగపడుతుందని తెలిపారు. రాజి మార్గమే రాజా మార్గంగా లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవడం ద్వారా కక్షిదారులకు సమయం, న్యాయవ్యయం ఆదా కావడంతో పాటు, దీర్ఘకాలిక న్యాయపరమైన వివాదాలకు సత్వర పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. మూడవ జాతీయ లోక్ అదాలత్‌లో రాజీకి అనుకూలమైన సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ క్లెయిమ్ (MVOP), కుటుంబ తగాదాలకు సంబంధిచిన కేసులు తదితర కేసులను పరిష్కరించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా, చట్టపరంగా రాజికి అవకాశం ఉన్న ఏడు సంవత్సరాల వరకు శిక్ష విధించదగిన క్రిమినల్ కేసులను కూడా లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించనున్నట్లు వెల్లడించారు.లోక్ అదాలత్‌లో కేసు పరిష్కారం కక్షిదారుల పరస్పర అంగీకారంతోనే జరుగుతుందని, ఇరుపక్షాలు తమ వివాదాన్ని రాజీ ద్వారా పరిష్కరించుకునేందుకు ముందుకు రావాలని ఆమె సూచించారు. తమ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలనుకునే కక్షిదారులు సంబంధిత న్యాయస్థానాన్ని లేదా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి, తమ కేసు లోక్ అదాలత్‌లో పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.కక్షిదారులు ఇరుపక్షాల అంగీకారంతో సెప్టెంబర్ 12, 2026న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌కు హాజరై కేసులను పరిష్కరించుకోవాలని DLSA కార్యదర్శి కోరారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ కేసులను సత్వరంగా పరిష్కరించుకోగలరని ఆమె విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!