ePaper
Tuesday, September 8, 2026
ePaper
Homeతెలంగాణతాతా మధు వ్యాఖ్యలను ఖండిస్తూ తాండూర్‌లో కాంగ్రెస్ భారీ ధర్నా.

తాతా మధు వ్యాఖ్యలను ఖండిస్తూ తాండూర్‌లో కాంగ్రెస్ భారీ ధర్నా.

📰 Generate e-Paper Clip

తాతా మధు వ్యాఖ్యలను ఖండిస్తూ తాండూర్‌లో కాంగ్రెస్ భారీ ధర్నా.

తాండూర్: అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 8.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనాలోచిత, అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ తాండూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఐబీ చౌరస్తాలో పెద్ద ఎత్తున శాంతియుత ధర్నా నిర్వహించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఆదేశాల మేరకు, డీసీసీ జిల్లా అధ్యక్షులు పిన్నింటి రఘునాథ్ రెడ్డి సూచనలతో తాండూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా. పెద్దబోయిన శంకర్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పదవి అత్యంత గౌరవప్రదమైన రాజ్యాంగబద్ధమైన పదవని, ఆ పదవిలో ఉన్న వ్యక్తిపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉండవచ్చని, అయితే ప్రజాస్వామ్య వ్యవస్థలోని రాజ్యాంగబద్ధమైన పదవులకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై తాతా మధు చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని, ఇకపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు పునరావృతం కాకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీసీ జిల్లా ఉపాధ్యక్షులు సూరం రవీందర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గట్టు మురళీధర్ రావు, మాజీ జెడ్పీటీసీ సాలిగామ బానయ్య హాజరై కాంగ్రెస్ శ్రేణులకు మద్దతు తెలిపారు.కార్యక్రమంలో తాండూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మొబిన్ అలి, సర్పంచులు ఆకుల వెంకటేష్, గాట్ల నరసయ్య, పోలవేణి తిరుపతి, కృష్ణపెళ్లి లక్ష్మణ్, మడావి పర్బత్ రావు, ప్రధాన కార్యదర్శులు అడప నవీన్, కట్కాల మల్లేష్, సెక్రటరీలు మాసాడి ప్రభాకర్, జైన సాంబయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మామిడాల రాజేశం,గాజుల రాంమోహన్ రావు,మరిశెట్టి శ్రీనివాస్ మోసిన్, పుట్ట శ్రీనివాస్, జంబోజుల ప్రవీణ్, కొండగొర్ల అంజి, వార్డు సభ్యులు గోర్లపల్లి బానేష్, గాజుల చందు, ఎండీ జావెద్ హుస్సేన్, పున్నం గౌడ్, చీకటి వెంకటేష్ గౌడ్, వెంకట్ గౌడ్, షేక్ మహమ్మద్, జోగిరాల రమేష్, పెద్దబోయిన రవీందర్, పెద్దబోయిన రాజేశం (పప్పీ), భగవంతు రావుతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!