ePaper
Tuesday, September 8, 2026
ePaper
Homeతెలంగాణతెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చిన్నారి సోమిడి నిషిరకు చోటువివిధ అంశాలను అలవోకగా చెప్పిన ప్రతిభకు...

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చిన్నారి సోమిడి నిషిరకు చోటువివిధ అంశాలను అలవోకగా చెప్పిన ప్రతిభకు అరుదైన గుర్తింపు.

📰 Generate e-Paper Clip

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చిన్నారి సోమిడి నిషిరకు చోటువివిధ అంశాలను అలవోకగా చెప్పిన ప్రతిభకు అరుదైన గుర్తింపు.

అర్జున్ సమాచారం సెప్టెంబర్ 8 పెద్దపల్లి జిల్లా. డెస్క్

పెద్దపల్లి పట్టణానికి చెందిన చిన్నారి సోమిడి నిషిర తన అసాధారణ ప్రతిభతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి అరుదైన ఘనత సాధించింది. చిన్న వయసులోనే శ్లోకాలు, తెలుగు–ఇంగ్లీష్ రైమ్స్, మానవ శరీర భాగాలు తదితర అంశాలను అలవోకగా, స్పష్టంగా చెప్పి తన ప్రతిభను చాటిన నిషిరకు ఈ విశిష్ట గుర్తింపు లభించింది.

చిన్నారి నిషిర ప్రతిభను గుర్తించిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నిర్వాహకులు ఆమె పేరును రికార్డ్స్‌లో నమోదు చేసి అవార్డుతో సత్కరించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి చిన్నారి నిషిరకు అవార్డును అందజేసి ప్రత్యేకంగా అభినందించారు.

చిన్న వయసులోనే ప్రతిష్టాత్మక రికార్డులో చోటు సంపాదించడంపై నిషిర కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో చిన్నారి మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

నిషిర సాధించిన ఘనతపై ఆమె తల్లి సోమిడి షాలిని నటరాజ్, నానమ్మ మహేశ్వరి, తాత, అమ్మమ్మ అక్కపాక తిరుపతి–మమతతో పాటు బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేస్తూ చిన్నారిని అభినందించారు.

చిన్నారి నిషిర ప్రతిభకు లభించిన ఈ అరుదైన గుర్తింపు ఆమెకు మరింత ప్రోత్సాహాన్ని అందించి, భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సృష్టించేందుకు దోహదపడుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!