ePaper
Sunday, September 13, 2026
ePaper
Homebusiness29వ డివిజన్‌లో ఆయేషా ఫ్రెష్ ఫ్రూట్ హబ్ ప్రారంభం.-ప్రజలకు నాణ్యమైన పండ్లు అందుబాటులోకి రావడం అభినందనీయమన్న...

29వ డివిజన్‌లో ఆయేషా ఫ్రెష్ ఫ్రూట్ హబ్ ప్రారంభం.-ప్రజలకు నాణ్యమైన పండ్లు అందుబాటులోకి రావడం అభినందనీయమన్న మేయర్ దర్ని మధుకర్.

📰 Generate e-Paper Clip

29వ డివిజన్‌లో ఆయేషా ఫ్రెష్ ఫ్రూట్ హబ్ ప్రారంభం.-ప్రజలకు నాణ్యమైన పండ్లు అందుబాటులోకి రావడం అభినందనీయమన్న మేయర్ దర్ని మధుకర్.

మంచిర్యాలజిల్లా: అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 13.

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 29వ డివిజన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆయేషా ఫ్రెష్ ఫ్రూట్ హబ్ను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ ప్రారంభించారు. నస్పూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ నూకల రమేష్, స్థానిక కార్పొరేటర్ బండారి సుధాకర్తో కలిసి మేయర్ రిబ్బన్ కట్ చేసి నూతన పండ్ల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ దర్ని మధుకర్ మాట్లాడుతూ నూతన వ్యాపారాన్ని ప్రారంభించిన నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన పండ్లు అందుబాటులో ఉండే విధంగా వ్యాపారాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. వినియోగదారులకు నాణ్యమైన పండ్లు, మంచి సేవలు అందిస్తూ వ్యాపార రంగంలో అభివృద్ధి సాధించాలని నిర్వాహకులను అభినందించారు.
ప్రజలకు అవసరమైన పండ్లు ఒకే చోట అందుబాటులోకి తీసుకురావడం ద్వారా స్థానికంగా వినియోగదారులకు సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు. నూతనంగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన నిర్వాహకులు ప్రజల ఆదరణ పొందుతూ మరింత అభివృద్ధి చెందాలని మేయర్ ఆకాంక్షించారు.
నూతన పండ్ల విక్రయ కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చిన మేయర్ దర్ని మధుకర్‌ను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. శాలువాతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మేయర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మేయర్‌తో పాటు ఎం.డి. మిన్హాజ్ ఉద్దీన్, ఇస్లాంపుర మాజీ కౌన్సెలర్ కల్వల జగన్ మోహన్ రావు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు.
నూతనంగా ప్రారంభమైన ఆయేషా ఫ్రెష్ ఫ్రూట్ హబ్‌తో 29వ డివిజన్ పరిధిలోని ప్రజలకు వివిధ రకాల పండ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రారంభ కార్యక్రమానికి స్థానికులు, వ్యాపారవేత్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరై నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!