ePaper
Sunday, September 13, 2026
ePaper
Homeతెలంగాణనెన్నెల ఎస్సై జగదీశ్వర్ రెడ్డికి ఘన సన్మానం.సేవాలాల్ సేన లంబాడి సంఘం నాయకుల అభినందనలు

నెన్నెల ఎస్సై జగదీశ్వర్ రెడ్డికి ఘన సన్మానం.సేవాలాల్ సేన లంబాడి సంఘం నాయకుల అభినందనలు

📰 Generate e-Paper Clip

నెన్నెల ఎస్సై జగదీశ్వర్ రెడ్డికి ఘన సన్మానం.సేవాలాల్ సేన లంబాడి సంఘం నాయకుల అభినందనలు.

అర్జున్ సమాచారం. సెప్టెంబర్ 13. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా.
నెన్నెల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన జగదీశ్వర్ రెడ్డిని సేవాలాల్ సేన లంబాడి సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు గుగ్లోత్ మల్లేష్ నాయక్ ఆధ్వర్యంలో ఆదివారం ఎస్సై కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు నూతన ఎస్సై జగదీశ్వర్ రెడ్డి కి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా గుగ్లోత్ మల్లేష్ నాయక్ మాట్లాడుతూ నెన్నెల మండలంలోని గిరిజన తండాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పోలీసు శాఖ ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. ముఖ్యంగా లంబాడీ ప్రజల సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ, వారికి పోలీసు శాఖ అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.తండాల్లో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు యువత చెడు వ్యసనాలు, అసాంఘిక కార్యకలాపాల వైపు వెళ్లకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.గిరిజన ప్రాంతాల్లో పోలీసు శాఖ చేపట్టే ప్రజా అవగాహన కార్యక్రమాలకు సేవాలాల్ సేన తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నెన్నెల మండలంలో శాంతిభద్రతలు మరింత పటిష్టంగా కొనసాగాలని నాయకులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన మండల అధ్యక్షులు దారావత్ విజయ్ నాయక్,బుక్య రవీందర్ నాయక్, దారావత్ గణేష్ నాయక్, దారావత్ రాజు నాయక్, పాల్త్య శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!